తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి

తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్‌ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.

New Update
తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి

తెలంగాణ వ్యాప్తంగా రాకీ పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ఆక్కా, చెల్లెళ్లు రాఖీలు కట్టారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి సోదరిలు సీఎంకు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్‌.. ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి, అక్కా తమ్ముళ్ల ఆప్యాయ బంధానికి ప్రతీక రక్షా బంధన్‌ అన్నారు. 

publive-image

publive-image

publive-image

తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సునితారావ్‌ రాఖీ కట్టి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. 

మరోవైపు టీసీపీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ రక్షా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సోదరి జగదీశ్వరి మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు రాఖీ కట్టారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

 బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రక్షా బంధన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్‌కు మహిళలు కాఖీ కాట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన మహిళలు ఈటలకు రాఖీ కట్టారు. అనంతరం ఈటల రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌,  నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రక్షా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన సోదరి  హితశ్రీ .. ఉత్తమ్‌కు రాఖీ కట్టి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

publive-image

publive-image

publive-image

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టారు. అనంతరం ఆమె ఎంపీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ప్రతీరూపానికి గుర్తు ఈ రాఖీ పండుగ అన్నారు. రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. 

publive-image

publive-image

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రక్షా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్ని తలసాని ఇంటికి వెళ్లిన మహిళలు తలసానికి రాఖీలు కట్టి  ఆయనకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని  మతాలకు అతీతంగా నిర్వహించుకుంటున్న పండుగ రక్షాబంధన్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్‌ నిర్వహించుకుంటున్న ప్రతీ ఒక్కరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

మరోవైపు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి రక్షా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రికి ఆయన సోదరి రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్‌ నిర్వహించుకుంటున్న ప్రతీ ఒక్కరికి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

publive-image

publive-image

ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకు వైద్య సిబ్బంది రాఖీలు కట్టారు. మంత్రి హరీష్‌ రావుతో రక్షా బంధన్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు.

Advertisment
తాజా కథనాలు