Telangana: 120 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.. భట్టీ కీలక ప్రకటన

రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో కాంప్లెక్సులో 4 చొప్పన 120 గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Telangana: 120 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.. భట్టీ కీలక ప్రకటన

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఒక్కో కాంప్లెక్సులో 4 చొప్పన 120 గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటి నిర్మాణం కోసం సంక్షేమశాఖల అధికారులు.. ఆయా నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి భూములు సమీకరించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం బీసీ సంక్షేమశాఖ నుంచి 800 మంది, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి 500 మంది విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Also Read: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు 100 శాతం పూర్తి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో 15-25 ఎకరాలు, పట్టణాల్లో 10-15 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తాం. ఎంతమందికి మంచాలు, బెడ్‌షీట్లు ఉన్నాయి ? ఇంకా ఎంతమందికి కావాలో ప్రతిపాదనలు పంపాలి. వీటి కొనుగోలుకు నిధులు విడుదల చేస్తాం. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో టాయిలెట్లు, నీటి సదుపాయం,కరెంటు, గదులకు తలుపులు ఉండాలి. ఆయా యజమానులు విద్యార్థుల సౌకర్యాల కల్పనకు రూల్స్ ప్రకారం వ్యవహరించాలని'' భట్టి అన్నారు.

మరోవైపు విదేశీ విద్యకు రెండో విడత ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు. సంక్షేమ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలు ఇవ్వాలని.. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సమయానికి నిధులు మంజూరు చేసే బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఇక జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనలపై కూడా భట్టి సమీక్ష చేశారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారని సాధారణ గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు బెడ్స్‌ వెంటనే ఏర్పాటు చేయాలని.. ఒక్క విద్యార్థి కూడా కింద పడుకోవడానికి వీల్లేదని చెప్పారు. అలాగే పాఠశాల మైదానాన్ని లెవలింగ్ చేయాలని, టాయిలెట్లు, ప్రహారి గోడల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: మరో యువకుడి ప్రాణంతీసిన ఆన్లైన్ బెట్టింగ్.. వందతో మొదలై రెండు కోట్లకు చేరి!

Advertisment
Advertisment
తాజా కథనాలు