ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకొని బదిలీ చేసినట్లు పలువురు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో విచారణ అనంతరం బదిలీల రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
Also read: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు