BIG BREAKING: ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల స్థానాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

BIG BREAKING: ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
New Update

Tamilisai Soundararajan: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలపై (Governor MLC Seats ) భర్తీపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున రెండు ఎమ్మెల్సీ భర్తీపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ALSO READ: FLASH: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!

బీఆర్ఎస్ కు నో..

గవర్నర్‌ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కొరకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం (BRS Party) దాసోజు శ్రవణ్ (Dasoju Sravan), కుర్రా సత్యనారాయణ రావుల (Kurra Satyanarayana) పేర్లను గవర్నర్ కు పంపింది. వారి ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించింది. తమిళసై తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం (KCR). గవర్నర్‌ కోటాలో రాజకీయ నాయకులను నియమించలేమన్న తమిళసై స్పష్టం చేసింది. అప్పట్లో గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాలని గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ALSO READ: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

DO WATCH:

#cm-revanth-reddy #mlc-elections #tamilisai-soundararajan #mlc-election-s #mlc-candidates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe