Farmers Protest: ముగిసిన నాలుగో విడత చర్చలు.. ఆ పంటలకే కనీస మద్దతు ధర రైతు నేతలు, కేంద్రమంత్రుల మధ్య నాలుగోసారి జరిగిన చర్చలు ముగిశాయి. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. By B Aravind 19 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Farmers Protest - 5 Year MSP Plan: తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు జరగగా.. తాజాగా నాలుగోసారి కూడా చర్చలు జరిపారు (4th Round Talks). ఆదివారం రాత్రి 8.15 PM గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగాయి. కేంద్రం తరుఫున కేంద్రమంత్రులు.. అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానంద్ రాయ్‌తో రైతు సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) కూడా పాల్గొన్నారు. Also Read: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. ఐదేళ్లపాటు MSP అయితే ఈ నాలుగో విడుత చర్చలు ముగిశాక కేంద్రమంత్రి పియూష్ గోయెల్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కనీస మద్దతు ధరపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేంద్ర సంస్థలు.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాక ఐదేళ్ల వరకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదన చేసింది. రైతులు పండించే కందులు,మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న, పత్తి పంటలను MSPకి కొనుగోలు చేసేందుకు.. NCCF, NAFED వంటి కేంద్ర సంస్థలు 5 ఏళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదు. ఇందుకోసం ఓ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. తమ ప్రతిపాదన వల్ల పంజాబ్‌లో ఉన్న పంటలకు రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగుపడి.. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని' ఆయన చెప్పారు. ఢిల్లీ చలో కార్యక్రమానికి బ్రేక్ మరోవైపు కేంద్రం ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పథేర్ స్పందించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. అలాగే నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని ఓ నిక్ణయానికి వస్తామన్నారు. రైతులకు రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా పరిష్కరం కాలేవని.. వీటిపై మరో రెండు రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందన్నారు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామన్నారు. ఒకవేళ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 21 నుంచి మళ్లీ ఆందోళలు కొనసాగిస్తామన్నారు. రైతుల డిమాండ్లు ఇవే ఇదిలా ఉండగా.. కనీస మద్దుతు ధర, ఎంస్ఎస్ స్వామినాథ్ కిషన్ కమిషన్ సిఫార్సును అమలు చేయడం, రైతులకు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు, రుణమాఫీ, విద్యుత్ ఛార్చిలపై టారిఫ్‌ల పెంపు నిలిపివేయడం, 2021లో రైతు ఉద్యమంలో నమోదైన కేసులు ఎత్తివేయడం, ఆ సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధన వంటివి రైతులు డిమాండ్ చేస్తున్నారు. Also Read: నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా.. #telugu-news #farmers-protest #msp #delhi-chalo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి