Government Schemes : తెలంగాణ(Telangana) లో ఈ నెల పాత పంథాలోనే పింఛన్లు(Pension) ఇవ్వనుంది కాంగ్రెస్(Congress) ప్రభుత్వం. అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని చెప్పింది కాంగ్రెస్. అయితే హామీపై స్పష్టత లేనందున పాత తరహాలోనే పింఛన్లను ఇస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ల సొమ్ము జమ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.
ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పారు. దీనిపైనే ఇంకా క్లారిటీ రాలేదు.
Also read:వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం
అభయహస్తం ప్రాసెస్‌లో...
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అహయహస్తం(Abhaya Hastham) ఆరు గ్యారంటీలు పథకాలు(6 Guarantees Schemes) అమల్లో ఉంది. దీని తాలూకా ప్రాసెస్ జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక్కో పథకానికి లక్షల్లో దరఖాస్తులు రావడంతో వాటి డేటాను ఎంట్రీ(Data Entry) చేస్తున్నారు. తరువాత అర్హత దారులను గుర్తించి వారికి పథకాలను అందించనున్నారు. ఈ మొత్తం వ్యవహారం అవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. అందువల్లనే కొత్త పింఛన్ల హామీని ఇంకా మొదలెపెట్టలేదని అధికారులు చెబుతున్నారు. మొత్తం పథకాలు అన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అప్పటి నుంచే పింఛన్ల పెంపు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.
పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులు..
తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎన్నింటికి ఆమోదం వస్తుందో ఇంకా తెలియలేదు కానీ... కొత్త వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రతినెలా పింఛన్లకు రూ.వెయ్యి కోట్లు అవుతున్న ఖర్చు మరింత పెరుగుతుంది.