Agnipath Scheme : అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్

ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు.

Rajnath Singh: రిజర్వేషన్లను రద్దు చేయము..  రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
New Update

Rajnath Singh : ప్రస్తుతం దేశంలో అగ్నిపథ్‌ స్కీమ్‌(Agnipath Scheme) అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికైన వారని అగ్నివీర్‌(Agniveer) లుగా పిలుస్తారు. అయితే తాజాగా ఈ పథకంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతీ, యువకులను కూడా సాయుధ బలగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు.

Also Read : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

అలాగే అగ్నివీరుల భవిష్యత్తు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీ(Delhi) లోని ఓ జాతీయ వార్త ఛానల్‌ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్‌ పథకంలో ఏమైన లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుతామని తెలిపారు. అయితే రాజ్‌నాథ్‌ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) తీవ్రంగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల గిమ్మిక్కే అని పేర్కొంది. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా మార్చేస్తామని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నిపథ్ పథకం తీసుకొచ్చింది. అగ్నిపథ్ పథకం ద్వారా పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతను నాలుగేళ్ల సర్వీసు కోసం ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి నెలవారీగా రూ.30 నుంచి 40వేల మధ్య వేతనం వస్తుంది. నాలుగేళ్లు పూర్తయ్యాక ఇందులో 25 శాతం అగ్నివీరులు మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. కేంద్రం ఈ పథకం తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయినప్పటికీ కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసింది.

Also Read : 10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గిన మహిళ!

#agnipath-scheme #telugu-news #national-news #rajnath-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe