Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే

మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళకు సెలవులు ప్రకటిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాలో మూడు రోజులు సెలవులు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు తాజాగా వరంజల్ జిల్లాల్లో స్కూళ్ళకు కూడా రేపు సెలవును ప్రకటించింది.

New Update
Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే

Warangal: మేడారం..సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభోగంగా మొదలైంది. నిన్న సాయంత్రం సారలమ్మ గద్దెనెక్కింది. ఈరోజు సమ్మక్క కూడా వైభోగంగా గద్దెనెక్కనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతర నేపథ్యంలో రేపు ఒక్క రోజు సూళ్ళకు సెలవును ప్రకటించింది. ఇది కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యాసంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వరంగల్‌లో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది.

publive-image

Also Read:Medaram Jathara 2024:నేడు మేడారానికి సమక్క..జాతరలో అసలైన ఘట్టం

ములుగులో నాలుగు రోజులు సెలవు..

ఇక మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాల్లోని(Mulugu District) పాఠశాలలు, కాలేజీలకు 4 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజులుపాటు జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ఆదేశించారు. దీంతో ములుగు విద్యార్ధులకు వరుసగా ఆదివారంతో కలిపి 5 రోజులు సెలవులు వచ్చాయి. మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలువులు ప్రకటించారు.

సమ్మక్క-సారలమ్మ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దాంతో పాటూ రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డిలు రేపు వనదేవతలను దర్శించుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు