Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో కొత్త గవర్నమెంటు ఏర్పడ్డాక గవర్నర్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారన్న దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు.

New Update
Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి!

Governor Tamilisai: కొత్త అసెంబ్లీలో మొదటిసారిగా గవర్నర్ తమిళి సై ఈరోజు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం మీద సామాన్య ప్రజలు, రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారెంటీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండడం దీనికి కారణం. ఇవాళ ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ (Telangana Assembly) సభ ప్రారంభం అవుతుంది. దీని వెంటనే గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సభ ఎన్ని రోజులు నడపాలనే దాని మీద నిర్ణయం తీసుకోనున్నారు.

Also read:నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న దీపికా పడుకోన్

ఆరు గ్యాంటీల అమలుతో గవర్నర్ బీఆర్ఎస్ (BRS) తొమ్మిదేళ్ళ పాలన గురించి ఏం మాట్లాడతారు అన్నదాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఆ విషయం ప్రస్తావిస్తారా లేదా మిగతా విషయాలు మాట్లాడి వదిలేస్తారా అన్న విషయం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతుంది. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ మొదటి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల వార్ నడిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. తొలి క్యాబినెట్‌లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Also read:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసి భారత్

Advertisment
తాజా కథనాలు