Goutam Gambhir : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం

ఇండియన్ క్రికెటర్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న గౌతమ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇక మీదట తన ఫోకస్ అంతా క్రికెట్ మీదనే అని తేల్చి చెప్పారు.

New Update
Goutam Gambhir : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం

Goutam Gambhir : మాజీ క్రికెట్ ప్లేయర్ గౌతమ్ గంభీర్(Goutam Gambhir) పాలిటిక్స్(Politics) నావల్ల కాదంటున్నారు. ఇక మీదట తాను రాజకీయాల్లో ఉండాలనుకోవడం లేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో(Elections) తాను కంటెస్ట్ చేయనని... తనను రాజకీయ సేవల నుంచి తప్పించాలని అధికార పార్టీ అయిన బీజేపీ(BJP) ని కోరారు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం అయన బీజేపీ తరుఫు నుంచి ఈస్ట్ ఢిల్లీ(East Delhi) ఎంపీగా ఉన్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. గంభీర్ 2019లో పాలిటిక్స్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీకి బీజేపీ తరుఫున ముఖచిత్రంగా మారారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన గౌతమ్...69 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎంపీ అయ్యారు.

క్రికెట్ మీదనే ఫోకస్..

గౌతమ్ గంభీర్ క్రికెట్‌లో ఎంత సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో కూడా అంతే విజయం సాధించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఎంపీగా కూడా పూర్తిస్థాయిలో తన సేవలను అందించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీకి పెద్ద అండగా నిలిచారు గౌతమ్ గంభీర్. తన పార్టీకి చాలా సార్లు సపోర్ట్ గా నిలిచారు కూడా. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం మాత్రం క్రికెట్టే అంటున్నారు గంభీర్. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గౌతమ్ రాజకీయాల్లో తన సేవలను అందిస్తూనే క్రికెట్ కామెంటేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే తన ఫైనల్ కెరీర్ ఛాయిస్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ మాజీ ఓపెనర్. రాజకీయాల్లో తనకు ఇంక ఇంట్రస్ట్ లేదని...కామెంటేటింగ్‌ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాని చెబుతున్నారు గౌతమ్ గంభీర్. రాజకీయాలు, క్రికెట్ రెండింటి మీద దృష్టి పెట్టడం కష్టమని.. అందుకే క్రికెట్‌(Cricket) కే ఛాయిస్ ఇస్తున్నాని తెలిపారు. పాలిటిక్స్ విధుల్లో నుంచి తనను తప్పించాలని బీజేపీ సీనియర్ లీడర్ జేపీ నడ్డాకు లేఖ రాశారు గౌతమ్.

Also Read : Andhra Pradesh: పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్

Advertisment
తాజా కథనాలు