Technology : ఫ్యూయెల్ సేవ్.. గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్... గూగుల్ మ్యాప్ మరో కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. దీంతో మనకు దగ్గర రూట్లు తెలియడమే కాక మన కార్ ఫ్యూయెల్ కూడా అదా అవుతుంది. దీని కోసం ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను ఫోన్లలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. By Manogna alamuru 16 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Google Maps : ఈరోజుల్లో ఎక్కడకు వెళ్ళాలన్నా పెద్ద కష్టమేమీ కాదు. వెతుక్కుని వెళ్ళాలి... ఎవరినో అడగాలి లాంటి బాధలే అస్సలు లేవు. గూగుల్ తల్లి మన చేతిలోకి వచ్చాక ప్రపంచమే చాలా చిన్నది అయిపోయింది. దారులు మన గుప్పిట్లో పట్టేస్తున్నాయి. మనకు కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్స్(Google Maps) లో పెట్టామా...డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోయామా. స్త్ర వాహనదారుడు అయినా పాటించే సింపుల్ పద్ధతి ఇది. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ఇది మరింత ఈజీ అయిపోయింది. టైమ్ , ట్రాఫిక్, హర్డిల్స్ అన్ని చూపించే గూగుల్ మ్యాప్స్ నిజంగా మనపాలిట దైవమే అని చెప్పాలి. Also read:శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తోంది. మొట్టమొదట్లో బేసిక్ రూట్ మ్యాప్ చూపించడం మొదలుపెట్టిన ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వెర్షన్స్ తో మనకు కావాల్సినవన్నీ అడక్కుండానే చూసించేస్తోంది.గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను మన ముందుకు తెచ్చింది. దీంతో టైమే కాదు ఫ్యూయెల్ కూడా ఆదా అంవుతుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ పేరు కూడా ఫ్యూయెల్ సేవింగ్. ఇది ఆల్రెడీ అమెరికా, యూరప్, కెనడాలలో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు భారత్‌లో కూడా మొదలయింది. ఈ కొత్త ఫీచర్ ను బట్టి రూట్, ట్రాఫిక్, లైవ్ అప్డేట్సే కాకుండా మన కార్ ఇంధన సామర్ధ్యాన్ని కూడా అంచనా వేస్తుంది. మన కారులో ఉన్న ఫ్యూయెల్, మనం వెళుతున్న వేగాన్ని బట్టి దానికి అనుకూలమైన రూట్‌ను చూపిస్తుంది. ఒకవేళ మనం ఏదైనా రూట్ ఎంచుకుంటే... ఆదారిలో వెళితే ఎంత పెట్రోల్ అవుతుందని అనే లెక్కను కూడా చూపిస్తుంది. దీనివలన డ్రైవ్ చేసే వాళ్ళు ముందుగానే కాలిక్యులేషన్స్ వేసుకుని ఫ్యూయెల్ ను ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఫ్యూయెల్ సేవింగ్ ను అనేబుల్ చేసుకోవాలంటే..యాప్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోని నేవిగేషన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. అందులో రూట్ ఆప్షన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. అందులో మళ్ళీ ప్రిఫర్ ఫ్యూయెల్ ఎఫిషియంట్ రూట్స్ అని ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లోనే మన కార్ ఇంజిన్, ఇంధనం స్త్రంటో కూడా చెప్పాలి. ఇలా చేస్తే గూగుల్ మ్యాప్ మన కార్‌కు తగ్గట్టు చూపిస్తుంది. Also read : White Lung Syndrome : చైనాలో కరోనాను మించిన వైరస్..గడగడలాడుతున్న ప్రపంచ దేశాలు #technology #google #feature #google-maps-update #maps #fuel-savings మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి