Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్

యాడ్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి గూగుల్ చెక్ పెట్టింది. భారత దేశంలో మొత్తం 1.2 ఖాతాలను తొలగించింది. ఏఐ టెక్నాలజీతో యాడ్స్ చేస్తూ మోసాలు చేస్తున్న వారి అకౌంట్లన్నీ ఇక మీదట తొలగిస్తామని చెప్పింది.

New Update
Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్

Google Ads : యాడ్స్ పేరుతో మోసాలు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంది గూగుల్. తమ అడ్వర్టైజింగ్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రకటనలు చూపిస్తున్న ఖాతాలన్నింటినీ సీజ్ చేసేసింది. ఇండియాలో మొత్తం 1.2 కోట్ల అకౌంట్లను బ్లాక్ చేసింది. తొలగించిన ఖాతాలన్నింటిలో మాల్వేర్, డీప్‌ఫేక్‌ కంటెంట్‌(Deep Fake Content) లు ఉన్నాయని చెబుతోంది గూగుల్(Google). వీటి మీద తమకు బోలెడు నివేదికలు వచ్చాయని... వాటిన ఇపరిశీలించాకనే తొలగించామని ప్రకటించింది.

ఏఐతో సవాళ్ళు...

ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ(AI Technology) నే కనిపిస్తోంది. దీన్ని సవ్యంగా వాడుతున్న వారి కంటే చెత్త పనులకు వాడుతున్నవారే ఎక్కువ అయిపోతున్నారు. ఏఐ ఉపయోగించి డీప్‌ఫేక్‌ వీడియోల తయారీ కూడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకే గూగుల్ చర్యలను ప్రారంభించింది. స్కామ్ ప్రకటనలు చేస్తూ వినియోగదారుల భద్రత, గోప్యతలతో ఆడుకుంటున్నారని..తాము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని చెబుతోంది. స్కామ్ ప్రకటనల మీద గూగుల్ పోరాటం కొనసాగుతుందని తెలిపింది.

ఎన్నికల ప్రకటనలు...

ప్రస్తుతం ఇండియా(India) లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. దీనికి సంబంధించి రోజులో ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి వాటన్నింటి మీద గూగుల్ దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రకటనల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పని చేస్తున్నామని తెలిపింది. 2023లో కంటే 2024లో ఎక్కువ ప్రకటనలు వస్తున్నాయని... వీటిలో దృవీకరణ కాని వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం 5000 కంటే ఎక్కువ ప్రకటనలు గూగుల్ ధృవీకరించింది. కానీ 7.3 మిలియన్ కంటే ఎక్కువ ప్రకటనలను తీసివేసింది. అయితే ఏఐ కారణంగా ఇది పెద్ద సవాల్‌గా మారుతోందని చెబుతోంది.

Also Read : Elections 2024 : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Advertisment
తాజా కథనాలు