హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం రద్దీ ఉంటుంది. ఇక దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే ట్రాఫిక్‌తో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాదు ఈ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ రహదారి మార్గంలో 17 చోట్ల బ్లాక్ స్పాట్లు ఉన్నాయని.. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకునేందుకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమైపోయింది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు పనుల బాధ్యతను ఓ సంస్థకు అప్పగించారు.
Also Read: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే
అయితే చౌటుప్పల్ నుంచి నవాబ్‌పేట జంక్షన్ వరకు 17 బ్లాక్ స్పాట్లను గుర్తించగా.. 10 చోట్ల అండర్ పాస్‌లను నిర్మించనునుంది జాతీయ రహదారుల సంస్థ. ప్రమాదాల నివారణ కోసం.. అండర్ పాసులతో సహా.. రోడ్లు వెడల్పు చేయడం, సైన్ బోర్టులు పెట్టడం లాంటి తదితర పనుల కోసం రూ.288 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, టేకుమట్ల, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, సూర్యాపేట ఫ్లై ఓవర్ ముగిసే చోట, ముకుందాపురం, కొమరబండ క్రాస్ రోడ్, రామాపురం క్రాస్ రోడ్ వద్ద అండర్‌పాసులు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కట్టంగూరు దగ్గర జంక్షన్‌ను అభివృద్ధి చేయడం, ఇనుపాముల దగ్గర ఉన్న సర్వీస్ రోడ్ విస్తరించడం, ధూర్జపల్లికి సమీపంలో ఉన్న జంక్షన్ అభివృద్ధితో పాటు మరో రహదారి నిర్మించినున్నారు. మరోవైపు ఆకుపాముల, నవాబ్‌పేట వెళ్లే మార్గాల వద్ద కూడా జంక్షన్లు అభివృద్ధి చేయడం, హైవే లైటింగ్‌తో సహా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక త్వరలోనే వీటికి సంబంధించిన పనులు మొదలుకానున్నాయి. ఇవి పూర్తయితే ఈ మార్గాల్లో వెళ్లేవారికి ప్రయాణం సాఫీగా జరుగుతుంది.
Also read: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్