Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!! ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. By Bhoomi 28 Sep 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2వేలకు పైగా పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు సెప్టెంబర్ 7తో ప్రారంభం కాగా... సెప్టెంబర్ 27తో ముగియాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో కీలక అప్ డేట్ ఇచ్చింది ఈ ఎస్బీఐ. పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షకు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు. పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810. అర్హతలు: ఏదైనా డిగ్రీ వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 – 30 సంవత్సరాలు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. జీత భత్యాలు: నెలకు రూ.41,960. పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810. అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: ఏప్రిల్ 1, 2023 నాటికి 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. #bank-jobs #latest-jobs #free-jobs #job-update #sbi-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి