Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!
ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.