Weather : తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. చల్లబడనున్న వాతావరణం

ఎండలకు మలమలామాడిపోతున్న తెలుగు రాష్టాలకు గుడ్ న్యూస్చెప్పింది వాతావరణ శాఖ. మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ ఈ నెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుంది. మూడురోజుల పాటూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

New Update
Weather : తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. చల్లబడనున్న వాతావరణం

Rains In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వేసవి(Summer) ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి వేడి మరీ ఎక్కువగా ఉంది. బయటకు వెళితే ప్రాణం పోతుందేమో అన్నంతగా ఎండలు మాడ్చేస్తున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత టచ్ అయింది. దీంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్నారుల అయితే వడదెబ్బకు బలవుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా..

అయితే మండే ఎండలకు కాస్త బ్రేక్ రానుందని చెబుతోంది వాతావరణశాఖ(Department of Meteorology). ఈనెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుందని తెలిపింది. 5వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే ఛాన్స్ చెప్పింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో వర్షాలు పడనున్నాయి. ఈనెల 6న తెలంగాణ(Telangana) వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట..మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరిలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మళ్ళీ 8న తెలంగాణవ్యాప్తంగా చిరుజల్లులు పడతాయి. మొత్తానికి వాతావరణం అయాఇతే చల్లబడుతుంది. మరోవైపు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే ఉండనుంది.

Also Read:Africa : కాంగోలో విజృంభిస్తున్న మంకీ పాక్స్..4నెలల్లో 300 మంది మృతి

Advertisment
తాజా కథనాలు