T20 World Cup 2024 Venues: ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 (ICC T20) ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. యూఎస్‌లోని డల్లాస్(Dallas), ఫ్లోరిడా(Florida), న్యూయార్క్ (New York) నగారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. వచ్చే ఏడాది వెస్టిండీస్ ఈ టోర్నీని నిర్వహించాల్సి ఉంది. కానీ క్రికెట్ అగ్రదేశాలకు సైతం విస్తరిస్తోందని అమెరికాలో ఈ టోర్నీని నిర్వహిస్తే రానున్న రోజుల్లో అమెరికాకు చెందిన టీమ్ సైతం క్రికెట్ ఆడే అవకాశం ఉందని, అందులో భాగంగానే ఈ మెగా టోర్నీని అక్కడ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
గత 10 సంవత్సరాలుగా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల సంఖ్య పెరుతూ వస్తోంది. గతంలో నేపాల్, యూఏఈ, స్కాట్లాండ్, నెదర్లాండ్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ టీమ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేవి కావు. రాను రాను ఆ టీమ్‌లు విదేశీ పర్యటనలు చేసి మేటి జట్లకు చెందిన బీ టీమ్‌లతో క్రికెట్ ఆడుతూ తమ సత్తా చూపించుకున్నాయి. ఇలాంటి టీమ్‌లో బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. గతంలో బంగ్లాదేశ్ టీమ్ అంటే క్రికెట్ పసికూన అనేవారు. కాని బంగ్లా టీమ్ పెద్ద జట్లను సైతం ఓడించి ప్రపంచ కప్ పోటీలో నిలిచింది.
మరోవైపు అఫ్ఘనిస్థాన్ జట్టులో ఒకరో ఇద్దరో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబి లాంటి ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి దేశవాళి టోర్నీల్లో పాల్గొని తమ సత్తాను ప్రపంచ దేశాలకు చూపించారు. దీంతో అఫ్ఘన్ టీమ్ ఇతర జట్లతో తలపడే సమయంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండటం క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోవైపు ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను యూఏస్‌ఏలో నిర్వహించనున్నట్లు ప్రకటించడంపై అమెరికా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read: వావ్ భలే ఉందే…వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది