World Cup 2023 Anthem: వావ్ భలే ఉందే...వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది మరో పదిహేను రోజుల్లో వన్టే క్రికెట్ వరల్డ్ కప్ మొదలవబోతోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ లో జరిగనుంది. ఈ టోర్నీకి సంబంధించి ఐసీసీ వరల్డ్ కప్ అధికారిక సాంగ్ ను రిలీజ్ చేసింది. By Manogna alamuru 20 Sep 2023 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి World Cup 2023 Anthem: మరో రెండు వారాల్లో భారత్ లో క్రికెట్ పండగ మొదలవనుంది. దాదాపు రెండు నెలలపాటూ రాష్ట్రాలన్నీ క్రికెట్ పిచ్చితో ఊగిపోనున్నాయి. అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ తలపడే మ్యాచ్ తో టోర్నీ ఆరంభం కానుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన యాడ్స్, ప్రమోషన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. అభిమానుల్లో క్రికెట్ ఫీవర్ ఆల్రెడీ పట్టుకుంది. దీనిని మరింత పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇప్పుడు టోర్నీకి సంబంధించి ఓ అధికారిక సాంగ్ ను విడుదల చేసింది. వరల్డ్ కప్ కోస్ ఐసీసీ ప్రత్యేకంగా పాటను రూపొందించింది. దిల్ జషన్ జషన్ బోలే అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇందులో రణవీర్ సింగ్ నటించాడు. ప్రీతమ్ చక్రవర్తి పాటను కంపోజ్ చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ పాటలో రణవీర్ సింగ్ తో పాటూ టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఆడి పాడారు. సోసల్ మీడియాలో వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్ దుమ్ము రేపుతోంది. అభిమానులు ఈ వన్డే ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. వరల్డ్ కప్ 2023 స్పెషల్ సాంగ్ spotify, Apple music, Gaana, Hungama, Resso, wynk, Amazon, Facebbok, Instagram and youtube స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది. త్వరలోనే బిగ్ ఎఫ్ ఎమ్, రెడ్ ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్లలో కూడా ఈ సాంగ్ ను వినొచ్చు. మరోవైపు ప్రపంచకప్ మ్యాచ్ చూసేందుకు భారతీయులు తెగ ఆరాటపడుతున్నారు. టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం టికెట్లు అమ్ముడు అయిపోతున్నాయి. ఇక వరల్డ్ కప్ కోసం భారత్ సిద్ధమవుతోంది. తాజాగా ఆసియాకప్ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచ్ లలో ఆడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ప్లేయర్లు తలపడుతున్నారు. DIL JASHN BOLE! #CWC23 Official Anthem arriving now on platform 2023 📢📢 Board the One Day Xpress and join the greatest cricket Jashn ever! 🚂🥳 Credits: Music - Pritam Lyrics - Shloke Lal, Saaveri Verma Singers - Pritam, Nakash Aziz, Sreerama Chandra, Amit Mishra, Jonita… pic.twitter.com/09AK5B8STG — ICC (@ICC) September 20, 2023 Also Read: నెంబర్ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్ #cricket #world-cup-2023-anthem #wc-theme-song #world-cup-theme-song #dil-jashn-bole #ranaveer-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి