Central Government Jobs : గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్(DR) లలో 4 శాతం పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను అందిస్తారు. జనవరి, జులై నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాదికి రెండుసార్లు డీఏ, డీఆర్‌లను పెంచుతారు. అయితే డీఏ పెంపును ప్రకటించిన ప్రభుత్వం.. గత నెలలో మార్చి నెల జీతాల పంపిణీకి ముందు బకాయిలు చెల్లించబోమని తెలిపింది.
Also read: మాధవీలతకు బీజేపీ బిగ్ షాక్.. నో బీఫామ్ ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి 7న కేంద్ర కేబినెట్ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 4 శాతం పెంపును ప్రాథమిక వేతనంలో 50 శాతానికి పెంచింది. కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే 4 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే హెచ్‌ఆర్‌ఏను కూడా పెంచారు. అయితే డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.12,868 కోట్ల భారం పడనుంది. అక్టోబర్ 2023లో మునుపటి డీఏ పెంపులో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్(DA), డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 నుంచి 46 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం 4 శాతం డిఏ పెంపును ప్రకటించడంతో.. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం నెలకు రూ.50 వేలు అనుకుంటే అందులో అతను లేదా ఆమెకు ప్రాథమిక వేతనం రూ.15,000గా ఉంటుంది. దీంతో ఆ ఉద్యోగి ప్రస్తుతం మూల వేతనంలో 46 శాతం అంటే రూ.6,900 పొందుతున్నారు. 4 శాతం పెంపు తర్వాత ఇప్పుడు రూ.7500 పొందుతారు. అంతకుముందు దానితో పోలిస్తే రూ.600 ఎక్కువ. ఆల్-ఇండియా సీపీఐ-ఐడబ్ల్యూకు సంబంధించి12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగానే డీఏ, డీఆర్ పెంపును నిర్ణయిస్తారు.
Also Read: తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా