Gold Rates Crossed 70k : బంగారం ధరలు(Gold Rates) రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైమ్ హై(All Time High) ని చేరుకున్నాయి. ఈరోజు పసిడి 70వేల మార్కును దాటేసింది. ఇవాళ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. మరోవైపు వెండి ధరలు(Silver Price) కూడా పసిడి ధరలతో పోటీ పడుతున్నాయి. నిజం చెప్పాలంటే వెండి బంగారం రెండు అడుగుల ముందే ఉంది. భారీగా పెరుగుతూ.. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్(International Market) లో కూడా గోల్డ్ మరోమారు రికార్డ్ స్థాయికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్ బంగారం ధర 2,319 డాలర్ల వద్ద ఉంది. దాంతో మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 500 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 600 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 410 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 1,000 పెరిగింది. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు లాంటి అంశాలు బంగారం రేట్ల మీద ప్రభావితం చూపిస్తున్నాయి.
Also Read: International: చంద్రుని టైమొచ్చింది..జిబిల్లి మీద టైమ్ సెట్ చేస్తున్న నాసా