Gold Rates Getting High Again : ఈరోజు బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరిగాయి. మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర మీద ఏకంగా 380 పెరిగింది. మరోవైపు వెండి కూడా బాదేస్తోంది. వెండిపై కూడా కిలోకు 300 రూ. పెరిగింది. ఈ ధరలు రోజూ వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల బంగార్ 22 క్యారెట్ల ధర 61, 760రూ. ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 67, 310 రూ. ఉంది. ఇక వెండి(Silver) కిలో 80,500రూ దగ్గర తూగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,850 ఉండగా... 24 క్యారెట్ల ధర 67, 460రూ గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్లు యధాతథమే కారణం..
రీసెంట్‌గా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఐదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటూ ఈ ఏడాదిలో కనీసం 3 సార్లు అయినా.. వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దీని కారణంగానే బంగారం రేటు పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఫెడ్(FED) ప్రకటనతో బంగారం ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఆ తరువాత కొన్ని రోజులు పెద్దగా పెరగలేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం మళ్ళీ కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తోంది.
అతంర్జాతీయస్థాయిలో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు అక్కడ 22234 డాలర్ల లెవెల్స్‌లో కొనసాగుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర చూస్తే 24.99 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.378 వద్ద ఉంది.
Also Read : Accident : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక