Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండడంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. దీంతో మన దేశంలోనూ బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దీపావళి పండుగ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయని భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా బంగారం ధరలు కొంచెం కొంచెం తగ్గుతుండడం ఊరట నిస్తోంది. బంగారం ధరల్లో తగ్గుదలతో దీపావళి కోసం బంగారం కొనాలని అనుకునే వారికి మంచి అవకాశం దొరుకుతుందనే చెప్పవచ్చు.
ఇక ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ లో(Hyderabad Gold Rate) ఈరోజు అంటే నవంబర్ 7 వతేదీ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 56,250 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గుదల కనబర్చి రూ.61,370లు గా ఉంది. అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 56,400 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు తగ్గుదల కనబర్చి రూ.61,510లు గా ఉంది.
Also Read: దీపావళికి కారు కొంటున్నారా? డెలివరీ సమయంలో ఇలా చేయడం తప్పనిసరి
మరోవైపు వెండి ధరలు(Silver Price) కూడా కిందికి దిగి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే 700 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ బంగారం ధర రూ.77,500లకు చేరుకుంది. ఇక ఢిల్లీలో కూడా వెండి ధరలు తగ్గాయి. ఇక్కడ కూడా కేజీకి 700 రూపాయలు తగ్గిన వెండి రూ.74,500ల దగ్గరకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర (Gold Rate Today) భారీగా తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 1975 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజుల కిందట 2 వేల డాలర్లకుపైగా ఇది ఉండేది. అదేవిధంగా ఇక వెండి ధర 22.92 డాలర్ల వద్ద ఉంది.
బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా ఉండే పరిస్థితులు, స్థానిక పన్నులు, డిమాండ్ ఆధారంగా ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. బంగారం కానీ, వెండి కానీ కొనాలని అనుకున్నప్పుడు మార్కెట్లో ధరలను చెక్ చేసుకోవడం మంచిది.