Gold Price Updates: బాగా తగ్గిన బంగారం ధర.. కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా?

బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది.

New Update
Gold Price Updates: బాగా తగ్గిన బంగారం ధర.. కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా?

Gold Price Today: బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అధిక ద్రవ్యోల్బణం కారణంగా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్ (US Federal Reserve) వడ్డీ రేట్లను పెంచుతుంది అన్న సంకేతాలతో యూఎస్ డాలర్ (US Dollar) సహా ట్రెజరీ ఈల్డ్స్ రికార్డ్ స్థాయికి చేరాయి.

సాధారణంగా యూఎస్‌ డాలర్‌ పెరిగితే...బాండ్లు, ఈల్డ్స్ కు డిమాండ్‌ పెరిగి..బంగారం ధర (Gold Price) పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్‌ ధర ఏకంగా 6 నెలల కనిష్టానికి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర భారత్ లో 10 గ్రాములకు 59 వేల మార్కు దిగువకు చేరుకుంది.

దీంతో బంగారం కొనేందుకు జనం భారీగా వస్తారని బంగారం షాపుల వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం దుకాణాలు బిజీ అయ్యే ఛాన్సులు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో జనం దీనిని మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Also Read: ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్.. మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్..!!

రాబోతున్నది పండగ సీజన్‌ కావడంతో ..కస్టమర్ల దగ్గర నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా పెరుగుతున్నాయని బంగారం షోరూంల వల్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు వరుసగా పతనం అవుతుండడంతో నేపథ్యంలో చాలా మంది కస్టమర్లు..వెయిట్‌ అండ్‌ వాచ్ మోడ్ లో ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా జనాలు ఎవరైనా సరే బంగారం ధరలు కిందకి దిగి వస్తున్నప్పుడు..ఎవరైనా సరే ఇంకా ధరలు ఇంకొంచెం తగ్గుతాయోమోనని ఎదురు చూస్తుంటారని షాపులు వారు భావిస్తున్నారు. ధరలు కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే..నవరాత్రికి ముందే సేల్స్ భారీగా నమోదు అవ్వొచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ పెరుగుదలకు, బాండ్‌ ఈల్డ్స్‌ పుంజుకునేందుకు దోహదం చేస్తుందని అన్నారు.

ఇది భారత్‌, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు పతనం అవడం, ఇంకా ఆయిల్ ధరలు పెరిగేందుకు దారితీస్తుందని చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో (Gold Price in Hyderabad) శనివారం తులం ధర రూ. 58.200 స్థాయికి దిగివచ్చింది. అలాగే దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సెంజ్‌ లో అక్టోబర్‌ నెలకి సంబంధించి రూ. 57. 096 స్థాయికి, ప్రపంచ మార్కెట్లో స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1,848 రూపాయల వద్ద ముగిసింది.

Also Read: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!

Advertisment
తాజా కథనాలు