Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా బాదేస్తున్న బబంగారం , వెండి ధరలు కాస్త ఊపిరి పోస్తున్నాయి. పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్‌లొ కొనుగోళ్ళు కూడా కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం తులం 22 క్యారెట్లు అయితే 60,590 ఉండగా..24 క్యారెట్లు 66,100 రూ ఉంది.

New Update
Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold And Silver Rates:బంగారం కొనాలనుకునేవాళ్ళు అలర్ట్ అవ్వండి. రెండు రోజులుగా మార్కెట్లో బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. కిందటి వారం భారీగా పెరిగాయి. వారంలోనే రెండు, మూడు వేలు పెరిగిపోయాయి. ఇప్పుడు బంగారం ధర తగ్గకపోయినా...పెరగకుండా స్థిరంగా ఉంది. కేవలం ఒకే రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 420 తగ్గింది అంతే. కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్న రోజుల్లో సపిడి తగ్గుతుంది అనే అవకాశం లేదని...అందుకే నిలకడగా ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిదని సూచిస్తున్నారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గతంలో పెంచింది. దాని వలన డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి బంగారం ధరలు తగ్గుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొద్ది రోజుల కిందట .. జూన్ సమీక్షా సమయంలో వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే మళ్లీ బంగారం ధరలు ఊపందుకుంటాయి. అందుకే బంగారం ధరలు వారం పాటు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 2156.15 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ ధర 25.21 డాలర్ల దగ్గర స్థిరంగా ఉంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.910 వద్ద ఉంది.

ఈరోజు ఆదివారం 10గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు 60,590రూ ఉండగా...24 క్యారెట్లు 66,100రూ.గా ఉంది. ఇక కిలో వెండి ధర 77,300రూ. దగ్గర కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 60,740 వద్ద ఉండగా.. అదే 24 క్యారెట్స్ పసిడి రేటు రూ. 66,250 వద్ద ట్రేడవుతోంది.

Also Read:TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!

Advertisment
తాజా కథనాలు