Gold and Silver Price: బంగారం కొనాలని అనుకునేవారికి కాస్త ఊరట కలుగుతోంది. అంతకుముందు వరుసగా నాలుగు రోజులపాటు స్థిరంగా ఉన్న బంగారం ధరలు నిన్నటి నుంచి కాస్త కిందకి దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్స్వల్పంగా తగ్గి (Gold Rates Dropped) గుడ్ న్యూస్ తీసుకువచ్చాయి. బంగారం ధరలు తగ్గడం అంటే పసిడి ప్రియులకు సంతోషాన్నిచ్చే విషయమే కదా. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు. అయితే, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.
నిన్న 300 రూపాయలు పెరిగిన వెండి ధరలు ఈరోజు 700 రూపాయలు పెరిగాయి. అంటే రెండురోజుల్లో కేజీ వెండి 1000 రూపాయల పెరుగుదల కనబర్చింది. బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది.. నిన్నటి నుంచి తగ్గుదల బాటలోకి వచ్చాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తమ్మీద బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు వెండి ధరలు రెండో రోజూ పెరిగాయి. ఈరోజు అంటే గురువారం (జనవరి 26) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold and Silver Price)దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold Price) 50 రూపాయలు తగ్గి రూ.57,700ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,950లకు దిగివచ్చింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గి రూ.57,850ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో రూ.63,100ల వద్ద కు చేరింది.
Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు
వెండి ధరలు ఇలా:
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold and Silver Price) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు మాత్రం రెండో రోజూ పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధరలు నిన్న 300 రూపాయల మేర పెరిగాయి. ఈరోజు మరో 700 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.77,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 700 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,000 లకు చేరుకుంది.
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు ఔన్స్ బంగారం 2023 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.90 డాలర్లుగా కొనసాగుతోంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.
Watch this interesting Video: