/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-21-5.jpg)
Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిగా లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 23 గేట్ల ఎత్తివేశారు. దిగువకు 51 వేల 726 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Also read: అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : సీఎం రేవంత్
పేరూరు దగ్గర గోదావరికి (Godavari) వరద ఉద్ధృతి చేరుతోంది. భారీ వర్షాలతో (Heavy Rains) సాయంత్రానికి గోదావరి దగ్గర వరద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరంకు 6 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.