Heavy Rains : భారీ వర్షాలతో గోదావరి (Godavari) లో వరద క్రమంగా పెరుగుతోంది. వరద (Flood) కారణంగా గోదావరికి ఎర్రనీరు చేరుతోంది. దీంతో పులస సందడి మొదలైంది. గోదావరిలో పులస చేప (Pulasa Fish) కోసం మత్స్యకారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఒక్క పులస పడితే పండగే అంటున్నారు. ఇప్పటివరుకు గోదావరిలో మూడు, నాలుగు మాత్రమే పులస చేపలు దొరికాయి. వీటి ధరలు వేలల్లో పలుకుతాయని చెబుతున్నారు. అందుకే మత్స్యకారుల వీటి కోసం చూస్తున్నారు. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also read: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!