Glenn Maxwell: ఏం ఆడాడురా బాబూ...రికార్డులన్నీ క్యూలు కట్టాయి.

ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. అసలు ఇలాంటి ఇన్నింగ్స్ మరొకటి ఉండదు అన్న రీతిలో మ్యాక్స్ వెల్ ఆడిన తీరు అందరి చేతా వావ్ అనిపించింది. అందుకే రికార్డులు అన్నీ వరుసపెట్టి క్యూ కట్టాయి.

New Update
Glenn Maxwell: ఏం ఆడాడురా బాబూ...రికార్డులన్నీ క్యూలు కట్టాయి.

Glenn Maxwell: వన్డే ప్రపంచకప్‌కే కాదు..మొత్తం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఆడాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Maxwell). ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో ఆస్ట్రేలియాకు (Australia) విజయాన్ని అందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. నొప్పితో నడవలేని పరిస్థితుల్లోనూ కడవరకూ క్రీజులో నిలిచి డబుల్ సెంచరీ కొట్టాడు. కంగారూలను సెమీస్ చేర్చాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును విజయ తీరాలకు చేర్చాడు మ్యాక్స్ వెల్. ప్యాట్ కమ్మిన్స్‌తో కలిసి అభేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 202 పరుగులు జోడించాడు. కంగారూలను సెమీస్ చేర్చాడు. కేవలం 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్.. ఆ ఊపులో బోలెడు రికార్డ్‌లను మోసుకుపోయాడు.

Also Read:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్

128 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టిన మ్యాక్సీ.. మొత్తంగా 21 ఫోర్లు, 10 సిక్సులు కొట్టాడు. వన్డేలలో టార్గెట్ ఛేజింగ్ లో డబుల్ సెంచురీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా గ్లెన్ రికార్డ్ సృష్టించాడు. వన్డేలలో ఇప్పటికే చాలా డబుల్ సెంచరీలు నమోదయ్యాయి కానీ.. అవన్నీ ఫ్స్ట్ ఙన్నింగ్స్ లో చేసినవే. దీంతో పాటూ 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ సాధించాడు. అంతకు ముందు మార్టిన్ గప్టిల్ 237, క్రిస్ గేల్ 215 పరుగులతో మ్యాక్స్‌వెల్ కంటే ముందున్నారు.

ఈ రెండింటితో పాటూ మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్‌లో (World Cup) బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో నంబర్ లేదా అంతకంటే దిగువన వచ్చి డబుల్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ కూడా నిలిచాడు. ఇక వన్డేలలో డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డులకు ఎక్కాడు. వన్డేలలో ఛేజింగ్‌లో అత్యధిక స్కోరు కూడా మ్యాక్సీదే. మరోవైపు వన్డేలలో ఓపెనర్ కాకుండా డబుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ కూడా మ్యాక్స్‌వెల్ కావటం విశేషం. వన్డేలలో మ్యాక్స్‌వెల్‌ది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టగా.. మ్యాక్సీకి 128 బాల్స్ అవసరం అయ్యాయి. అలాగే ఏడో వికెట్ లేదా అంతకంటే దిగువన వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం కూడా మ్యాక్స్‌వెల్, కమ్మిన్స్‌దే (Pat Cummins) కావటం విశేషం. అలాగే ఈ మ్యాచ్‌లో పది సిక్సులు కొట్టిన మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో ప్లేసుకు చేరాడు. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లలో గేల్ 49 సిక్సులు కొట్టగా.. రోహిత్ 45 సిక్సులతో రెండో ప్లేసులో ఉన్నాడు. మ్యాక్స్‌వెల్ 43 సిక్సర్లతో మూడో స్థానంలోకి చేరాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు