Accident In South Africa : సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. వంతెనపై వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది మృతి చెందారు. కేవలం ఓ 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 46 మంది యాత్రికులు బోట్స్‌వానా రాజధాని అయిన గ్యాబరోన్ నుంచి మోరియా టౌన్‌లో ఈస్టర్(Easter) వేడుక కోసం చర్చికి వెళ్తున్నారు.
Also Read : 10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గిన మహిళ!
ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
అయితే మామట్లకాల అనే కొండ ప్రాంతంలో ఉన్న వంతెన పైకి రాగానే ఈ బస్సు అదుపు తప్పింది. ఆ తర్వాత ఆ బ్రిడ్జి పైనుంచి లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది మృతి చెందారు. ఓ 8 ఏళ్ల బాలిక మాత్రం తీవ్ర గాయలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన గురువారం జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు.
సురక్షితమైన ఈస్టర్ జరుపుకుందాం
బోట్స్‌వానా రవాణాశాఖ మంత్రి సిండిసివే చికుంగా.. ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అలాగే ఈ ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా స్పందించారు. మనకు రోడ్లపై జరిగే విషాదాలు చూసేందుకు ఎదురుచూసే సమయం కాదని అన్నారు. సురక్షితమైన ఈస్టర్ పండుగను జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. సౌత్ ఆఫ్రికా(South Africa) లో ఇప్పటికే సరైన రోడ్లు ఉండవనే రికార్డు ఉంది.
Also Read : ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు కోటీశ్వరుడు!