Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే?

రాహుల్‌ గాంధీని మల్లికార్జున్‌ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్‌ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్‌ అనాలిస్ట్‌ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్‌ అనాలసిస్‌ కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే?
New Update

Mallikarjun Kharge v/s Rahul :  మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ను అకస్మాత్తుగా ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా INDIAకూటమి ప్రతిపాదించింది. డిసెంబర్ 19, 2023న జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ప్రతిపక్షాల అభ్యర్థనను ఖర్గే తిరస్కరించలేదు. 'ముందు గెలుద్దాం, ఆ తర్వాత చూద్దాం' అని బదులిచ్చారు. నిజానికి రాహుల్‌(Rahul) ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. అయితే చాలా మంది ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ను ఇష్టపడరు లేదా వారి సొంత నిర్ణయాలను కలిగి ఉన్నారు. కాబట్టి, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు. ఇది రాహుల్‌కు పూర్తిగా నిరాశ కలిగించే విషయం. భారత్ జోడో యాత్ర తర్వాత, రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయ దిగ్గజం అయ్యారని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంది. రాహుల్‌కు ప్రత్యామ్నాయం లేదన్న అతి విశ్వాసం రాహుల్ గాంధీలోనూ, ఆయన వర్గాల్లోనూ ఉంది.

వాస్తవానికి, 2023 డిసెంబర్‌లో జరిగే 5-రాష్ట్రాల ఎన్నికలకు ముందు వరకు కూడా రాహుల్ గాంధీ సర్కిల్ కాంగ్రెస్ గెలుపుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నరేంద్ర మోదీని ఎలా ఓడిస్తాం అనే దానిపై పెద్ద ఎత్తున వాయిస్‌ వినిపించింది.

అయితే జీవితం ఊహించలేనిది. గొప్ప ఫ్రెంచ్ ఆర్థికవేత్త ప్రౌధోన్ ఇలా అన్నాడు: ' ఫెర్టిలిటీ ఆఫ్ ది అన్-ప్రిడిక్టబుల్ ' అంటే భవిష్యత్తు ఊహించడానికి కూడా అసాధ్యం. విధిపై భారతీయులకు కూడా చాలా నమ్మకం ఉంది. బహుశా మల్లికార్జున్ ఖర్గేకి విధి ఉంది. జీవితం లేదా రాజకీయాలు ఊహించలేని స్థితికి ఉత్తమ ఉదాహరణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా ?

రాహుల్ గాంధీ ఎలా ఓడిపోయారు?
1. డిసెంబర్, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఓడిపోయింది. రాహుల్ గాంధీ ప్రతిష్టను ఘోరంగా దెబ్బతీసింది. కాంగ్రెస్‌ ఓడిందంటే నరేంద్ర మోదీకి చాలా ప్రజాదరణ ఉందని, 2024లో గెలుస్తారని అర్థం.

2. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లాంటి ప్రాంతీయ నాయకులు రాహుల్ గాంధీని ఇష్టపడలేదు. రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా మారడాన్ని ఎన్నడూ అంగీకరించలేదు.

3. నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర శరద్ పవార్ లాంటి నాయకులు ప్రధాని కావాలని ఆలోచిస్తున్నారన్న ప్రచారం ఉంది. వారు ప్రధాని అభ్యర్థి కాకపోతే రాహుల్ గాంధీ కాకూడదు.

4. రాజకీయాల్లో నాయకులు నిరంతరం వినయం ప్రదర్శించాలి. ప్రజలను దగ్గర చేసుకోవాలి. శత్రువులను స్నేహితులను చేసుకోవాలి. అయితే చాలా మంది నేతలకు రాహుల్ గాంధీ ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తెలుస్తోంది.

5. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మల్లికార్జున్ ఖర్గే గురించి ఆకస్మిక ప్రకటన చేయడానికి స్పష్టంగా ప్లాన్ చేసుకున్నారు. ‘మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి అవుతారు.' ఈ ప్రకటన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్‌లోని ఆయన వర్గాన్ని కదిలించింది.

మల్లికార్జున్ ఖర్గే ఆశయాలు:
ఖర్గే చాలా తెలివిగల రాజకీయ నాయకుడు. 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు. ఖర్గే తనను తాను ప్రధాని కోసం ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ చూపించుకోలేదు. నిజానికి, అశోక్ గెహ్లాట్ సెప్టెంబరు, 2022లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటానికి నిరాకరించినప్పుడు, గాంధీలు మల్లికార్జున్ ఖర్గేను దళిత, సీనియర్ రాజకీయవేత్తగా ఎన్నుకున్నారు. ఆయన గాంధీలకు పూర్తిగా విధేయుడిగా వ్యవహరించారు.

అయితే ఒక్కసారి అవకాశం వస్తే అందరూ మారిపోతారు. పి.వి.నరసింహారావుకు బానిస(చెప్పింది చెపపినట్లు చేస్తాడని) అవుతాడని గాంధీలు అనుకున్నారు. కానీ నరసింహారావు బానిసగా ఉండటానికి నిరాకరించారు.

మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని షాకింగ్ ప్రకటన చేసినప్పుడు, ఖర్గే తాను ఎన్నటికీ అభ్యర్థిని కాదని, రాహుల్ గాంధీ మాత్రమే ఆ పదవికి అర్హుడని చెప్పవచ్చు. కానీ ఖర్గే ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అతని తక్షణ ప్రతిస్పందన "మేము గెలుస్తామో లేదో చూద్దాం".

అయితే, మరికొద్ది రోజుల్లో నష్టనియంత్రణ జరుగుతుందని, ప్రధానమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని ఖర్గే ప్రకటనలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం నష్టం జరిగిపోయింది. రాహుల్ గాంధీ కంటే ఖర్గేకే ప్రాధాన్యత ఇస్తున్నామని యావత్ దేశం ముందు విపక్ష నేతలు అన్నారు.

ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినందుకు గాంధీలు పశ్చాత్తాపం చెందడం ప్రారంభించారు,.ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తున్నారు. అతని ఆశయాలను చూపించడం ప్రారంభించారు. నిజానికి, 2023 అక్టోబర్‌లో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడయిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగే అన్ని వేడుకలను కాంగ్రెస్ జరపలేదు. రాహుల్ గాంధీని మెల్లమెల్లగా ఖర్గే బయటకు నెట్టివేస్తారని గాంధీలు ఆందోళన చెందుతున్నారనడానికి ఇదే మొదటి సంకేతం అని భావించవచ్చు. అయితే ఖర్గే రాహుల్ గాంధీని నిశ్శబ్దంగా బయటకు నెట్టారు.

INDIA కూటమిలోని ప్రతిపక్ష నాయకులు ఖర్గేకు సహాయం చేశారు. నిజానికి రాహుల్ గాంధీని నాయకత్వ ఆశయాల నుంచి తొలగించారు. అంటే రాహుల్ గాంధీని 2024కి ప్రధాని అభ్యర్థిగా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకటించరు. తర్వాత 2029లో జరిగే ఎన్నికలకు చాలా దూరంలో ఉంది.

మల్లికార్జున్ ఖర్గే దళిత నాయకుడని ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్, గాంధీలు ఖర్గేను బయటకు నెట్టలేరు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రతీకారం తీర్చుకున్నారు. శరద్ పవార్, నితీష్ కుమార్‌తో పాటు ఇతరులు నిశ్శబ్దంగా సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ ఎంతో తెలివైన ఈ రాజకీయ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పరు. ఏది ఏమైనా రాహుల్, అతని కోటరీని ఖర్గే అధిగమించడం.. గాంధీ కుటుంబ మద్దతుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read: రాజకీయ రణరంగంలో బీసీ మహిళా యోధులు

WATCH:

#rahul-gandhi #india #general-elections-2024 #mallikharjan-kharge #dr-pentapati-pullarao-editorials
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe