Genaral ticket: మనదేశంలో రైలు ప్రయాణం చేసేవారు చాలా మందే ఉంటారు. ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాఉల ఎక్కువ అయినప్పటికీ ట్రైన్ జర్నీలకు మాత్రం గిరాకీ తగ్గలేదు.ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారు రైలు ప్రయాణాలనే కావాలనుకుంటారు. అయితే ట్రైన్ బుక్ టికెట్లు తీసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా ఈజీ అయిపోయింది. రైల్వే యాప్‌లోనే ఈజీగా టికెట్ బుక్ సేసుకోవచ్చును. అయితే ఇది కేవలం రిజర్వేషన్ చేసుకునేవారికి మాత్రమే అందుబాటులో ఉంది. అదే జనరల్‌లో ప్రయాణించాలి అంటే స్టేషన్‌కు వెళ్ళి టికెట్ తీసుకోవాల్సిందే. యాప్‌లో కూడా జనరల్ టికెట్ తీసుకోవచ్చు కానీ..కేవలం రెండు స్టేషన్ల దూరం నుంచి మాత్రమే ఇది సాధ్యమయ్యేది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అప్ డేట్ చేసింది రైల్వేశాఖ.
ఎక్కడ నుంచి అయినా...
జనరల్ టికెట్ బుకింగ్ కోసం ఇక మీదట లైన్లలో నిలబడి కష్టాలు పడక్కర్లేదు. దీనికి కోసం రైల్వేశాఖ ఇంతకు ముందే యూటీఎస్ యాప్‌ను తీసుకువచ్చింది. అయితే ఇందులో ఇప్పటివరకు స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే జనరల్ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో ఈ యాప్ వల్ల పెద్ద ఉపయోగం లేకుండా అయిపోయింది. అందుకే దీన్ని అప్‌డేట్ చేసింది రైల్వేశాఖ. దాని ప్రకారం రైలు ఎంత దూరంలో ఉన్నా టికెట్ పొందేలా యాప్‌ను అప్‌డేట్ చేశారు. దీనివలన ఇప్పుడు ఇంట్లో ఉండగానే ఎంత దూరం నుంచి అయినా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చును. అయితే ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోవల్సింది ఏంటంటే..సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్ పనిచేయదని గమనించాలి.
Also Read:Health: ఏది తినాలన్నా భయమే..బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్ భూతం