Health: ఏది తినాలన్నా భయమే..బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్ భూతం క్యాన్సర్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏం తినాలన్నా భయం, చివరకు గాలి పీల్చాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు. అన్నింటిలోనూ కల్తీలు..దేనికీ లేని సేఫ్టీ. తాజాగా భారత్‌లో 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలున్నాయని ఫుడ్ స్టేఫీ విబాగం చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 26 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పాలు కల్తీ.. నీరు కల్తీ.. తినే ఉప్పు, పప్పు, పసుపు కూడా కల్తీ.. బయట ఫుడ్ కల్తీ.. ఆర్గానిక్ ఫుడ్ కూడా కల్తీ.. దాదాపు మనం వాడుతున్న ప్రతినిత్యావసర వస్తువులోనూ ఏదో ఒకరకంగా కల్తీ కలుస్తోంది..! కల్తీ ఆహారాలు ప్రజల ఆరోగ్య జీవితంతో చెలగాటమాడుతున్నాయి. అనేక రోగాల బారిన పడడానికి కారణమవుతున్నాయి. 527 భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలను ఈయూ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సంస్థ గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఏం తినాలి? డాక్టర్లు హెచ్చరిస్తున్నాదేంటి? ఏం తిన్నా.. ఏం చేసినా క్యాన్సర్ బారిన పడాల్సిందేనా? ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజల మరణాలకు క్యాన్సర్ కారణమవుతుంది. దేశంలో ప్రతీఏడాది క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏడాదికి 14 లక్షలుగా ఉన్న కేసుల సంఖ్య.. 2040నాటికి ఏడాదికి 20లక్షల కేసులగా నమోదవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య 79శాతం పెరిగాయి. అంటే వయసుతో సంబంధం లేకుండా దాదాపు అన్నీ వయసుల వారిని క్యాన్సర్ పీడిస్తోంది. ఇప్పటికే భారత్‌లో తయారయ్యే అనేక ఆహార పదార్థాలను వివిధ దేశాలు నిషేధించాయి. ఎలాంటి ఫుడ్ సెఫ్టీ స్టాండర్డ్స్ పాటించకుండా ఇండియాలో ఆహారం తయరవుతుందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. 527 ఉత్పత్తుల్లో ఎథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ తాజాగా తేల్చింది. ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల లింఫోమా, లుకేమియా లాంటి క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉంటుంది. నువ్వులు, ఆశ్వగంధ, మిర్యాలు లాంటి ఆహార పదార్థాలను ఆర్గానిక్ పద్ధతిలో పండించామని కంపెనీలు లేబుల్ చేసుకుంటున్నాయి కానీ.. పదార్థాలు చెడిపోకుండా ఇథిలీన్ ఆక్సైడ్‌ను ఆయా కంపెనీలు వాడుతుండడం విడ్డూరం. ఉత్పత్తుల రుచి కోసం, దీర్ఘకాలం నిల్వ కోసం ఆర్గానిక్ ముసుగులో రసాయనాలు కలపడానికి మించిన మోసం ఇంకోటి ఉండదు! క్యాన్సర్‌కు అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్సతో ఆ కణితిని తొలగించడం ఓ విధానం. ఒక వేళ కణితిని పూర్తిగా తొలగించగలిగి, క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే, క్యాన్సర్‌కి పూర్తి చికిత్స చేసినట్టు అర్థం. ఇది క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తేనే సాధ్యం. కీమోథెరపీ, రేడియోథెరపీతోనూ క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. క్యాన్సర్ కణాలతో పోరాడే మెడిసన్స్‌ను శరీరానికి అందించడం కీమోలో భాగం... అటు రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలను పూర్తిగా నిర్ములించే పద్ధతి రేడియోథెరపీ. అయితే ఈ చికిత్సలన్ని చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కొ క్యాన్సర్‌కు ఒక్కొ రకంగా ఖర్చు ఉంటుంది. అయితే సగటున క్యాన్సర్ బారిన పడితే 15 నుంచి 48 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే! క్యాన్సర్‌కు కారకాలగా అనారోగ్యకర చెడు ఆహారపు అలవాట్లు, అధిక బరువు, మద్య పానం, ఊబకాయం, పొగాకు లాంటివి చెబుతుంటారు. ఇది ముమ్మాటికి నిజమే. అయితే మనం ప్రతీ ఆహారంలోనూ కల్తీ కలుస్తున్నప్పుడు ఇక ఏదీ తిన్నా తాగినా అది క్యాన్సర్‌కు కారణమవుతుండడం నిజంగా బాధాకరం. #cancer #cause #food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి