Israel-Gaza War: గాజా గజగజ..ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు!

గాజాపై ఇజ్రాయెల్ మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం గాజాలోని రెండు పెద్ద అపార్ట్‌మెంట్స్‌పై దాడి చేయగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దాడిలో 100 మందికిపైగా మృతి చెందగా.. 200 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Israel-Gaza War: గాజా గజగజ..ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు!
New Update

Israel Gaza War: గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు పాల్పడుతోంది. మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతుండగా గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం వరుస దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ గాజాలోని రెండు పెద్ద అపార్ట్ మెంట్లను కుప్పకూల్చింది. ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతి చెందగా 200 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇది కూడా చదవండి: Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!

16,456 మంది చిన్నారులు మృతి..

ఇప్పటికే 1.8 శాతం మంది గాజా ప్రజలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వారిలో 75శాతం మంది 30 ఏళ్ల లోపువారే ఉండగా..16,456 మంది చిన్నారులున్నారు. 11,088 మంది మహిళలు, 885 మంది వైద్య సిబ్బంది, 168 మంది జర్నలిస్టులు, 79 మంది రక్షణ సిబ్బంది ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ గాజాపై ఇజ్రాయెల్ 3486 సార్లు దాడికి పాల్పడగా మొత్తం 92,152 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అనధికారంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

#israel-hamas-war #israel-war #gaza #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe