Eagle Movie: ఈగల్ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మాస్ మహారాజ్

రవితేజ లేటెస్ట్ సినిమా ఈగల్. ఫిబ్రవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విజృంభనమ్.. విధ్వంశమ్.. గరుడమ్ అంటూ సాగిన ఈ పాట.. హీరో ఎలివేషన్ కు తగిన లిరిక్స్ తో ఆసక్తిగా ఉంది.

Eagle Movie: ఈగల్ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్.. గూస్ బంప్స్  తెప్పిస్తున్న మాస్ మహారాజ్
New Update

Eagle Movie - Garudam Lyrical Song: కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఈగల్. సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల చేయాలనుకున్న ఈ చిత్రం వాయిదా పడింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, హనుమాన్ ఇలా ఐదు సినిమాలు ఒకేసారి రావడంతో థియేటర్ల రద్దీ కారణంగా ఈగల్ నిర్మాతలు ఈ సినిమాను కాస్త వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈగల్ (Eagle) కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 9 (February) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో నేడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.

విజృంభనమ్.. విధ్వంశమ్.. గరుడమ్

ఈ సందర్భంగా సినిమాలోని 4వ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. విజృంభనమ్.. విధ్వంశమ్.. గరుడమ్ (Garudam Song) అంటూ సాగిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. పాటలోని లిరిక్స్ హీరోలో ఎలివేషన్ కు తగ్గట్లు ఆసక్తిగా ఉన్నాయి. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా.. శ్రీ కృష్ణ అండ్ టీమ్ రౌద్రమైన గానంతో పాటను అద్భుతంగా పాడారు. పాటలోని లిరిక్స్ సినిమా మరింత ఆసక్తిని

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే

publive-imageఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్  లో వైల్డ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ లో నటించారు. నవదీప్ (Navdeep), వినయ్ రాయ్, మధు, శ్రీనివాస్, అవసరాల అజయ్ ఘోష్, నితిన్ మెహతా, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీ. జీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read: Vishwambhara: 18 ఏళ్ల తర్వాత.. మెగాస్టార్‌తో మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్

#garudam-lyrical-song #ravi-teja-eagle-movie #ravi-teja #anupama-parameswaran #eagle-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe