బండి సంజయ్ ఓ దుర్మార్గుడు.. నా కుటుంబాన్ని వేధించాడు.. మంత్రి గంగుల

అధికార పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బిజేపీ నాయకుడు బండి సంజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు. సంజయ్ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, ఐటీ తమ చేతిలో ఉందనే అహంకారంతో తనపై దాడులు చేయించారని మండిపడ్డారు.

బండి సంజయ్ ఓ దుర్మార్గుడు.. నా కుటుంబాన్ని వేధించాడు.. మంత్రి గంగుల
New Update

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరికి మించి ఒకరు ప్రజల్లోకి వెళుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బిజేపీ నాయకుడు బండి సంజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గంగుల కమలాకర్.. బండి సంజయ్ ఓ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబాన్ని వేధించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు గతంలో తన కుటుంబం ఊర్లో లేనప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి దౌర్జన్యం చేశాడని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీ ఉందని అహంకారంతో దాడి చేయించారని ఆరోపించారు. బండి లాంటి దుర్మార్గునికి, అవినీతి పరునికి ఓటేద్దామా అని ప్రశ్నించారు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. తనను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కరీంనగర్ ను మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో గారడి విద్యల్లాంటి మోసపూరిత మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోరాడి సాధించుకున్న తెలంగాణాను కాపాడుకోవడానికి మళ్లీ కేసీఆర్‌నే గెలిపించాలని కోరారు. తాను చేసిన అభివృద్ధే తనకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ను మూడోస్థానానికి పరిమితం చేస్తానన్నారు.

Also read : ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన రణ్‌బీర్.. వీడియో వైరల్

అలాగూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, పేదల సంక్షేమం కోసం పనిచేసే బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా తనన మరోసారి ఎన్నుకుంటే కరీంనగర్‌ పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ద్వారా దేశంలోనే కరీంనగర్‌ గొప్ప నగరంగా మారుతుందన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు, అభ్యర్థులకు అవగాహనే లేదని, చిత్తశుద్దితో ఎలా పనిచేస్తారని ప్రశ్నిచారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా.. దీనిపై బండి సంజయ్ ఎలా స్పందింస్తాడనే ఆసక్తి నెలకొంది.

#bandi-sanjay #karimnagar #gangula-kamalakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe