ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన రణ్‌బీర్.. వీడియో వైరల్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 14’లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ‘యానిమల్’ ప్రచారంలో భాగంగా ఈ షోకు హాజరైన రణ్ బీర్ కపూర్.. మేనుక పౌదేల్ అనే అంధ గాయని కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. By srinivas 24 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 14’లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ‘షాందార్ పరివార్’ అనే ప్రత్యేక ఎపిసోడ్ త్వరలో ప్రసారం కాబోతుండగా ప్రచారంలో భాగంగా ఇందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో ‘యానిమల్’ సినిమా హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన పాల్గొనగా వీళ్లిద్దరూ కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌లను చూసి తెగ ఎంజాయ్ చేశారు. అలాగే ప్రేక్షకులతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్న రణ్ బీర్ ఒక అంధ గాయని పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు. వెంటనే వేదికపైకి వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో తెగ వైరల్ అవుతోంది. Menuka ke fan bane Ranbir aur share kiya audience se apna baby playlist. Dekhiye #IndianIdol, Sat-Sun raat 8 baje, sirf #SonyEntertainmentTelevision par.@shreyaghoshal @VishalDadlani #KumarSanu #Hussain @fremantle_india pic.twitter.com/sgqZ0ggI6q — sonytv (@SonyTV) November 23, 2023 ఈ మేరకు సోనీ టీవీ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ అభిమానులతో పాటు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మేనుక పౌదేల్ అనే అంధ గాయని రణ్‌బీర్ కపూర్ పాట ‘అగర్ తుమ్ సాత్ హో’ను ఆలపించారు. ఆమె ఈ పాటను ఎంతో మధురంగా ఆలపించడంతో రణ్‌బీర్ కపూర్ ఎంతో ఆనందపడిపోయారు. పాట పాడడం పూర్తికాగానే.. రష్మిక మందనతో కలిసి వేదికపైకి వెళ్లిన రణ్‌బీర్, మేనుక కాళ్లకు నమస్కరించారు. ‘మేనుక గారు, నా పేరు రణ్‌బీర్. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ పాటను శ్రేయా గారు మొదటి సారి పాడినప్పుడు అందరికీ ఇదే ఫీలింగ్ కలిగింది. శ్రేయా గారిని దేవత అని అంటారు. ఇప్పుడు ఇంకో దేవత మా ముందు సాక్షాత్కరించారు’ అని రణ్‌బీర్ కపూర్ అన్నారు. ఆ తర్వాత మేనుక కూడా రణ్‌బీర్‌ను ఒక విషయం అడిగారు. ‘మీరు చాలా క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉంటారని నేను విన్నాను. కాబట్టి మీ కూతురు కూడా చాలా ముద్దుగా ఉంటుంది. ఆమెతో మీరు ఉన్నప్పుడు ఆమె కోసం ఎలాంటి పాట లేదంటే జోలపాట పాడతారు?’ అని రణ్‌బీర్‌ని మేనుక అడిగారు. దీనికి స్పందించిన హీరో ‘అప్పుడు సాధారణంగా నేను రెండు పాటలు పాడతాను. దానిలో ఒకటి బేబీ షార్క్ పాట. ఇది కాస్త చికాకు తెప్పించేలా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం చిన్న పిల్లలు ఆ పాటే ఇష్టపడుతున్నారు. ఇక రెండో పాట లల్లా లల్లా లోరి’ అని చెప్పడంతో షోలో ఉన్నవాళ్లంఆ ఒక్కసారిగా పగటపడి నవ్వుకున్నారు. Also read : గత 25 ఏళ్లుగా అలాంటి పనులు చేయట్లేదు.. సల్మాన్ కామెంట్స్ వైరల్ ఇక శ్రేయా గోషాల్ దీనిపై స్పందిస్తూ.. ‘అచ్చం రణ్‌బీర్‌లాగే నేను చేస్తుంటాను. మా పిల్లల కోసం మా ప్లే లిస్ట్ మొత్తం మారిపోయింది. కలలోకి కూడా అవే పాటలు వస్తున్నాయి’ అని నవ్వుతూ అన్నారు. ఇక ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ ఇండియన్ ఐడల్ షో గురించి మాట్లాడారు. ఇండియన్ ఐడల్ షోని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని రణ్‌బీర్ అన్నారు. ప్రతిభావంతులను ఈ షో వెలికితీస్తోందని కొనియాడారు. మన దేశ సంస్కృతిని మరో స్థాయికి తీసుకెళ్తోందని ప్రశంసించారు. 14 సీజన్‌ను జరుపుకుంటోన్న ఇండియన్ ఐడల్‌కు ఆయన అభినందనలు ఈ ఎపిసోడ్ శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారం కానుంది. #indian-idol #ranbir #contestant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి