జైల్లలో శిక్ష అనుభవించే ఖైదీలు పలు ముఖ్యమైన కారణాలతో పెరోల్ ద్వారా బయటికి వస్తారన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఓ గ్యాంగ్‌స్టర్ ప్రేమ పెళ్లి చేసుకోనున్నాడు. కొన్ని గంటల పాటు అతడు పేరల్ నుంచి బయటకు వచ్చి బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హర్యాణాకు చెందిన సందీప్.. రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరీ మార్చి 12న పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్లిద్దరి పెళ్లి కోసం గ్యాంగ్‌స్టర్ సందీప్‌కు కోర్టు అతడికి ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. మరో విషయం ఏంటంటే అనురాధ కూడా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది.
Also Read: ఎనిమిదేళ్ల బాలుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే
ఆమె కూడా గ్యాంగ్‌స్టరే
ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అలియాస్ కాలా జథేడీ సన్నిహితుడు. అతనిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి పలు కేసులు నమోదయ్యాయి. అయితే అనురాధ.. ఆనంద్‌పాల్ సింగ్‌అనే మరో గ్యాంగ్‌స్టర్ వద్ద పనిచేసింది. 2017లో అతడు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ తర్వాత అనురాధ.. కిడ్నాప్, బెదిరింపులు, మనిలాండరింగ్ వంటి పలు కేసుల్ని ఎదుర్కొంది. కొన్నిరోజుల తర్వాత ఆమెకు తన స్నేహితుడి ద్వారా సందీప్‌తో పరిచయం ఏర్పడింది.
నాలుగేళ్లుగా ప్రేమలో
గత నాలుగేళ్ల నుంచి వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు. పలు కేసులు ఎదుర్కొంటున్న వీళ్లిద్దరూ 2020లో పోలీసుల నుంచి తప్పించుకొని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. చివరికి 2021 జులైలో పోలీసులకు దొరికిపోయారు. అయితే కొంత కాలం తర్వాత అనురాధ బెయిల్‌పై విడుదలైంది. దీంతో గ్యాంగ్‌స్టర్లైన సందీప్, అనురాధలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సందీప్ పెళ్లి చేసుకునేందుకు పెరోల్ ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి అంగీకరించిన కోర్టు అతనికి మార్చి 12న ఆరు గంటల పాటు పేరోల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌స్టర్ల పెళ్లి పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.
Also Read: చేతుల ట్రాన్స్‌ప్లాంటేషన్..ఢిల్లీ వైద్యుల మిరాకిల్