/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Khairatabad-Ganesh-1-jpg.webp)
గణేశ్ నిమజ్జనోత్సవం సందర్బంగా హైదరాబాద్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు భారీ ఎత్తున ఏర్పాటు చేారు. ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం రాత్రి తుదిపూజ నిర్వహించి...కలశ పూజను పూర్తి చేశారు. ఇప్పటికే మహాగణపతి విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించి వెల్డింగ్ పని పూర్తిచేశారు. ఈ మహాగణనాథుడి శోభాయాత్ర ఉదయం 6గంటలకే ప్రారంభం అయ్యింది.
ఈ శోభాయాత్రను వేగతవంతం చేసేందుకు పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు మొదట నెక్లెస్ రోడ్డుకు తరలిస్తారు. టెలిఫోన్ భవన్ నుంచి సెక్రేటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ పై ఏర్పాటు చేసిన భారీ క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుంటుంది. అక్కడే చివరి పూజలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2గంటల మధ్య ఖైరాతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు.
The 63 feet eco-friendly Khairatabad Ganesh (clay idol), the tallest Ganesha in Hyderabad, getting ready for Shobha Yatra, welding work is going on.#KhairatabadGanesh #Hyderabad #GaneshImmersion #Ganeshotsav2023#GaneshFestival pic.twitter.com/v8SwOiL6Kl
— Surya Reddy (@jsuryareddy) September 27, 2023
మరోవైపు శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం బందోబస్తును ఏర్పాటు చేసింది. 40వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. 20వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సిటిలో అన్ని చోట్ల నిరంతరం నిఘా పెడుతున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఐదు చోట్ల 6 క్రేన్లు, పదుల సంఖ్యలు జేసీబీలు, వేలాది మంది సిబ్బంది రెడీగా ఉన్నారు. 48గంటలపాటు పాటు సాగే ఊరేగింపును 20వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!