Ganesh Immersion : గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాయకుడు..ఉదయం 6గంటలకే శోభాయాత్ర ప్రారంభం..!!
నేడు హైదరాబాద్ సిటిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. నవరాత్రుల్లో మండపాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథులు నేడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు బయలుదేరారు. ఖైరతాబాద్ వినియకుడి శోభాయత్ర ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. చివరిసారిగా గురువారం రాత్రి కలశ పూజ నిర్వహించారు. శోభాయాత్రను వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఉదయం 8గంటల కల్లా టెలిఫోన్ భవన్ కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి 10 వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్.. మధ్యాహ్ననం 12 కల్లా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉండేలా ప్లాన్ చేశారు అధికారులు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గణపతి బప్పా మోరియా అంటూ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు.