G7 Summit: రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం..

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించాయి.

New Update
G7 Summit: రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం..

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఉక్రెయిన్‌కు రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను అందించాలని ఏడు దేశాలు (అమెరికా, కెనడా, జపాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ) తీర్మానించాయి. గురువారం జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాగా.. చివరికి ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Also read: కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం!

రష్యా ఆస్తుల నుంచి నిధుల సేకరణ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో రష్యాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన రష్యా ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఐరోపా దేశాల్లోనే ఉన్నాయి. సాంకేతికంగా, చట్టపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సేకరించాలనేదానిపై జీ7 దేశాలు సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా పరిహారం చెల్లించేవరకు.. ప్రస్తుతం నిలిపివేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలు తొలగించకూడదని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి.

ఇక తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడుత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్ పీఎం రిషి సునాక్‌ తాజాగా ప్రకటన చేశారు. ఇదిలాఉండగా.. జీ7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలోని అపులియా ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ బోర్గో ఇగ్నాజియా రిసార్టులో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తదితరులు కూడా అతిథులుగా ఈ సదస్సుకు వచ్చారు.

Also Read: నా రూటే సపరేటు.. జీ 7 లో అమెరికా అధ్యక్షుని వింత ప్రవర్తన!

ఇదిలాఉండగా.. జీ7 సదస్సులో పోప్‌ ఫ్రాన్సిన్‌ కూడా మాట్లాడనున్నారు. గాజా, ఉక్రెయిన్‌లలో శాంతి కోసం ఆయన పిలుపునివ్వనున్నారు. అయితే జీ7 సదస్సుకలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో.. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), మధ్యధరా, ఇంధనం, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు ఇటలీకి బయలుదేరేముందు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గ్లోబల్‌ సౌత్‌కు కీలకమైన అంశాలపై సమాలోచనలు జరపనున్నట్లు చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక.. మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన పర్యటన ఇదే.

Advertisment
Advertisment
తాజా కథనాలు