Engineering: కంప్యూటర్‌ సైన్స్‌, ఏఐకి ఫుల్‌ డిమాండ్‌.. కోర్‌ బ్రాంచీల సంగతేంటి !

ప్రస్తుతం ఇంజినీరింగ్ సీట్లలో 70 శాతం కంప్యూటర్‌ సైన్స్ సంబంధిత బ్రాంచీలే ఉన్నాయి. గత మూడేళ్లుగా సివిల్, మెకానికల్ లాంటి కోర్ బ్రాంచీల్లో ఎక్కువగా విద్యార్థులు చేరడం లేదు. దీంతో రాష్ట్ర సర్కార్‌ కోర్ బ్రాంచుల్లో చేరేవారికి ఎక్కువ ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని యోచిస్తోంది.

New Update
Engineering: కంప్యూటర్‌ సైన్స్‌, ఏఐకి ఫుల్‌ డిమాండ్‌.. కోర్‌ బ్రాంచీల సంగతేంటి !

ప్రస్తుతం ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా మారిపోయింది. దీంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ లాంటి కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వారిని ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి స్కాలర్‌షిప్స్‌ అందజేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇంటర్‌, తత్సమాన పరీక్షలల్లో వచ్చిన మార్కులను కొలమానంగా తీసుకోని.. దేశవ్యాప్తంగా 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేయనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా మిగిలిన బ్రాంచీల్లో విద్యార్థుల కంటే కోర్‌ బ్రాంచీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఎక్కువగా ఇవ్వాలని భావిస్తోంది.

మూడేళ్లుగా కోర్‌ బ్రాంచీల్లో చేరని విద్యార్థులు

అయితే తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు తొలిదశ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎప్పట్లాగే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్‌ సంబంధిత కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ (AI)కి ఫుల్ డిమాండ్ ఉంది. అయితే గత మూడేళ్లుగా కోరు బ్రాంచీల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సీఎస్‌ఈ అనుబంధ కోర్సుల సీట్లను పెంచుకునేందుకే యత్నస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఆయా కోర్సుల్లో సీట్లు తగ్గగా.. మెనేజ్‌మెంట్‌, కన్వీనర్ కోటా సీట్లకు ఫుల్ డిమాండ్‌ ఉంది.

Also Read: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి

సీట్లు పెంచుకుంటున్న కళాశాలలు

ప్రస్తుతం బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. సోమవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఆదివారం రాత్రే ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల వివరాలను ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 98,296 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో కంప్యూటర్ సైన్స్ సంబంధిత సీట్లే 67 వేల దాకా ఉన్నాయి. మళ్లీ ఇందులో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSC), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లర్నింగ్ (CSM), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – డేటాసైన్స్ (CSD) బ్రాంచులకు చెందిన సీట్లే 53 వేల వరకు ఉండటం గమనార్హం. ఇప్పుడు విద్యార్థులంతా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల వైపే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలు ఆ కోర్సుల సీట్లను పెంచుకుంటున్నాయి.

సీట్ల మార్పుకు సిద్ధం

ఇందులో భాగంగానే ఈ ఏడాది 9 వేలకు పైగా సీట్లను కోర్‌ బ్రాంచుల నుంచి సీఎస్‌ఈ రిలేటెడ్ సీట్లకు మార్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఇలా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. గత ఏడాదితో పోలిస్తే.. కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో దాదాపు 7 వేలకు పైగా సీట్లు తగ్గాయి. దీంతో ఇప్పుడున్న సీట్లకే ఫుల్ డిమాండ్ ఉంది. ఇదిలాఉండగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది 20 వేలకు పైగా కొత్త సీట్లకు AICTE అనుమతి ఇచ్చింది. ఇందులో కూడా దాదాపు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కోర్ బ్రాంచుల సీట్లు తగ్గించి.. ఎక్కువ మొత్తంలో కంప్యూటర్ సైన్స్‌ రిలేటెడ్ బ్రాంచుల వైపే కళాశాలలు మొగ్గు చూపడంపై సర్కార్‌ పునారాలోచన చేస్తోంది.

ఎక్కువ డొనేషన్లు తీసుకుంటున్న కాలేజీలు 

మరోవైపు కొత్త సీట్లకు ఆర్థికశాఖ కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సర్కార్‌పై మరింత భారం పడనుంది. కొన్ని సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌లో, అలాగే మరికొన్ని సీట్లకు జనరల్‌ మోడ్‌లో ఇచ్చేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇంజినీరింగ్ బీ కేటగిరీలో కూడా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), సీఎస్‌ఈ సీట్లకు మంచి డిమాండ్ ఉంది. మేనేజ్మెట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి షెడ్యూల్ రాకముందే.. యాజమాన్యాలు ఆయా సీట్లను ఇప్పటినుంటే బేరానికి పెట్టాయి. ఇప్పటికే ఈ కోటాలో 70 శాతం సీట్లు అమ్మేశాయి. ఇప్పుడు తక్కువ సీట్లే ఉండటం వల్ల ఒక్కో సీటుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఒకవేళ కొత్త సీట్లకు పర్మిషన్ ఇస్తే.. డొనేషన్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

Also Read: గుడ్‌న్యూస్.. వాళ్లకి పెన్షన్‌ రూ.10వేలకు పెంపు !

ఇంజినీరింగ్ బీ కేటగిరీలోనూ ఏఐ, సీఎస్ఈ సీట్లకు ఫుల్ రెస్పాన్స్ ఉంది. మేనేజ్​మెంట్​ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ రాకముందే, యాజమాన్యాలు ఆయా సీట్లను బేరానికి పెట్టాయి. ఇప్పటికే దాదాపు 70 శాతం సీట్లను అమ్మేశాయి. తక్కువ సీట్లే ఉండడంతో ఒక్కో సీటును రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా డొనే షన్లు తీసుకుంటున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీట్లకు పర్మిషన్ ఇస్తే, డొనేషన్లు తగ్గే అవకాశం ఉంది.