FSSAI : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ

ఎవరెస్ట్, ఎండీహెచ్‌ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో.. భారత ఆహార భద్రత సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసాల దినుసుల కంపెనీల నుంచి నమూనాలను సేకరించడం ప్రారంభించింది.

FSSAI : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ
New Update

Masala : ఎవరెస్ట్(Everest), మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(MDH) కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో హాంకాంగ్, సింగాపూర్ దేశాలు వాటిని నిషేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఈ రెండు మసాల దినుసుల తయారీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముందుగా ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరించాలని కేంద్రం.. ఫుడ్‌ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఫుడ్‌ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసాల దినుసుల కంపెనీల నుంచి నమూనాలను సేకరించడం ప్రారంభించింది.

Also Read: ఉదయం టిఫిన్‌ చేయకపోతే ఈ ముప్పు తప్పదు జాగ్రత్త

సాధారణంగా తయారీదారులు.. తమ ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు తరచుగా ఇథైలిన్ ఆక్సైడ్‌ను వినియోగిస్తుంటారు. వాస్తవానికి భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఈ రసాయనాన్ని వినియోగించేందుకు అనుమతించదు. అయితే ప్రస్తుతం ఎవరెస్ట్, ఎండీహెచ్‌ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో.. అన్ని మసాల దినుసుల కంపెనీల్లో వాటి ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేసేందుకు శాంపిల్స్ తీసుకోవడం ప్రారంభించింది.

ఏప్రిల్ 5న హాంగ్‌ కాంగ్‌(Hong Cong) కి చెందిన ఆహార భద్రత సంస్థ.. ఎండీఎచ్‌ మద్రాస్ కర్రీ పౌడర్, ఎండీహెచ్ సాంబర్ మసాల, ఎండీహెచ్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తమ దేశంలో నిషేధించింది. ఈ మసాల దినుసుల్లో క్యాన్సర్‌కు దారితీసే పెస్టిసైడ్స్‌, ఇథైలీన్ ఆక్సైడ్‌లు ఉన్నట్లు పేర్కొంది. అలాగే సింగపూర్‌కి చెందిన ఆహార భద్రత సంస్థ.. ఎవరెస్ట్‌ ఫిష్ కర్రీ మసాలలో స్థాయికి మించి ఇథైలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించింది. ఆహారంలో ఇథైలిన్ ఆక్సైడ్‌ను కలిపేందుకు అనుమతి లేదని వెల్లడించింది.

Also Read: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రమత్తు, అలసిపోయినట్లు అనిపిస్తుందా..? అయితే ఇవి తెలుసుకోండి

#food-safety #everest-masala #mdh-masala #fssai #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe