Health Tips : వేసవిలో దాహం తీరేందుకు ఈ ఫ్రూట్స్ తీసుకోండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 29 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer : ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు(Heat) దంచికొడుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్న ఉక్కపోత ఆగడం లేదు. మధ్యాహ్నం పూట బయటికి వెళ్లేందుకే జనాలు జంకుతున్నారు. అంతేకాదు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. వేసవి కాలం(Summer Season) లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతాయి. Also Read : మండే ఎండల్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఫుడ్స్ ఇవే.! వేసవిలో ఒక మంచి ఫ్రూట్‌గా వాటర్‌మెలన్(Watermelon) ను తీసుకోవచ్చు. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. అంతేకాదు దీన్ని తీసుకోవడం వల్ల అటు పోషకాల పరంగా.. ఇటు పలు వ్యాధులు రాకుండా నివారించేందుకు సహకరిస్తుంది. వాటర్‌మెలన్‌లో ఉండే ఆమినో యాసిడ్.. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. ఇక స్ట్రాబెర్రీ(Strawberry) లో ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, విటమిన్ సీ, మాంగనీస్, పోటాషియం లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడటంతో పాటు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. అలాగే వీటితో పాటు ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు కూడా ఈ వేసవిలో దాహం తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. Also Read : ఆఫీసు టేబుల్ పై పొరపాటునా ఈ మొక్కలు పెట్టకండి..మీ ఉద్యోగానికి ఎసరు తప్పదు..! #telugu-news #health-tips #summer #heat #summer-fruits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి