Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో పిటిషన్

ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను తేజో మహాలయం( శివాలయం)గా ప్రకటించాలని ఆగ్రా కోర్టులో బధవారం కొత్త పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దీనిపై పిటిషన్ వేశారు. ఏప్రిల్‌ 9న దీనిపై విచారణ జరగనుంది.

Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో పిటిషన్
New Update

తాజ్‌మహల్‌ను ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు ప్రపంచంలో ఉన్న ఏడు వింతంల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ కట్టడాన్ని చూసేందుకు నిత్యం లక్షలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. అయితే గతంలో తాజ్‌మహాల్‌ లోపల శివాలయం ఉందంటూ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ వివాదం మరింత ముదిరింది. తాజ్ మహల్‌ను తేజో మహాలయం( శివాలయం)గా ప్రకటించాలని ఆగ్రా కోర్టులో బధవారం కొత్త పిటిషన్ దాఖలైంది.

Also Read: కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవి విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు

ఇస్లామిక్ కార్యకలాపాలు నిలివేయాలి

యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ (Ajay Pratap Singh) తాజ్‌మహల్‌పై ఈ పిటిషన్ వేశారు. అంతేకాదు ప్రస్తుతం తాజ్ మహల్‌లో నిర్వహిస్తు్న్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంటనే ఆపివేయాలని తన పిటీషన్‌లో కోరారు.

గతంలో కూడా పిటిషన్లు

మరో విషయం ఏంటంటే తాజ్‌మహల్‌ గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని చెబుతూ వివిధ పుస్తకాలను ఉదహరించారు న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్. దీంతో ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ 9న విచారణ జరగనుంది. ఇదిలాఉండగా.. తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని ఇప్పటికే కొంతమంది కోర్టులో పిటిషన్లు వేశారు. ఇందులో న్యాయస్థానం కొన్ని పిటిషన్లు కొట్టివేయగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 9న అజయ్ ప్రతాప్ సింగ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుండటంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఆసక్తి నెలకొంది.

Also Read: కరెన్సీ నోట్లపై నిద్రించడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నేత

#shiva-temple #telugu-news #national-news #taj-mahal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe