Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి ఫ్రీ టికెట్స్..

అయోధ్యకు వెళ్లాలనుకునే వారికి పేటీఎం బంఫర్ ప్రకటించింది. పేటీయం యాప్‌ ద్వారా మొదటగా బుక్ చేసుకునే వెయ్యిమంది వినియోగదారులకు ఉచితంగా అయోధ్యకు ఉచిత టికెట్‌ ఆఫర్‌ను కల్పించనుంది. అయితే ఈ ఆఫర్‌ జనవరి 19న ప్రారంభమైంది.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి  ఫ్రీ టికెట్స్..

అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు రేపు (సోమవారం) అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్య అంతటా ఆధ్యాత్మికత శోభ నెలకొంది. ఈ వేడుకక జరగనున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం కలిసి భారీగా భద్రత బలగాను మోహరించాయి. దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Also Read: సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

ప్రత్యేక రైళ్లు

అంతేకాదు అయోధ్యకు వచ్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. అయితే తాజగా ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి ఓ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. రాముడిని దర్శించాలనుకునేవారికి ఆ యాజమాన్య సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ ఓ పథకాన్ని ప్రారంభించింది. అయితే దీని కింద ఏకంగా వెయ్యి మందికి అయోధ్యకు వెళ్లేందుకు ఉచితంగా బస్ టికెట్ దొరకనుంది.

జనవరి 19న ప్రారంభం

అయితే ఈ ఆఫర్‌ను పేటీఎం జనవరి 19న ప్రారంభించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లే ప్రయాణికల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. పేటీయం యాప్ ద్వారా మొదటగా బుక్‌ చేసుకునే వెయ్యి మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు పొందవచ్చు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించారు.

Also Read: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు