బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్

తెలంగాణలో 'మహాలక్ష్మీ పథకం'తో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అవకాశం కల్పించడంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ఆడవాళ్లను ఏమీ అనకండి. అలిగి బస్సు ఎక్కి వెళ్లిపోతారని కొందరంటే మరికొందరు.. భార్యలు ఊర్లు తిరిగితే భర్తలంతా బార్లకే అంటున్నారు.

బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్
New Update

తెలంగాణలో 'మహాలక్ష్మీ పథకం'తో కాంగ్రెస్ ప్రభుత్వంమహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అవకాశం కల్పించడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చనడుస్తోంది. యూట్యూబ్ తదితర ఇంటర్నెట్ వేదికల్లో ప్రస్తుతం ఇదే వార్త ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబర్స్ మొత్తం ఇదే ఇష్యూపై రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తుండగా మరికొందరు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నవ్వులూ పూయిస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఎక్కువగా రీల్స్ చేస్తున్న ఆడవాళ్లకు ధీటుగా మగాళ్లు సైతం కౌంటర్లు ఇచ్చే రీల్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రముఖ కార్టూనిస్ట్ లు సైతం భార్య, భర్తల గొడవలు, తదితర అంశాలపై సరదా సన్నివేశాలను చిత్రీకరిస్తూ తెగ అలరిస్తున్నారు. జనాలను నవ్వులు పూయించే కొన్ని సరదా వీడియోలు, ఫొటోలను ఒకసారి మనమూ చూసి ఎంజాయ్ చేద్దాం.

ఈ మేరకు మహిళలు తమన తాము సపోర్ట్ చేసుకుంటూ ఇలా రీల్స్ చేస్తున్నారు. 'హాయ్.. ఇంట్లో ఆడవాళ్లను ఏమీ అనకండి. వాళ్లు అలిగి ఏ బస్సు ఎక్కి వెళ్లిపోతారు తెలియదు. అసలే ఫ్రీ జర్నీ. ఎందుకంటే మన రేవంత్ రెడ్డిగారు వేసిన ఫ్రీ బస్సు లు ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోతే మీరు వెతకలేక చచ్చిపోవాలి. ఒకవేళ వెతికేందుకు వెళ్లిన మీకు బోలేడు డబ్బులు ఖర్చు అవుతాయి. మగాళ్ల జేబు ఖాళీ. అందుకే ముందుగా ఆలోచించుకోండి. ఏమీ అనకండి' అంటూ తెగ మురిసిపోతున్నారు.

publive-image

అలాగే భార్యలంతా ఊర్లు తిరిగితే భర్తలంతా బార్లు తిరుగుతారంటూ ప్రముఖ కార్టునిస్ట్ వేంపల్లి బాబాజీగారు వేసిన చిత్రం నవ్వులు పూయిస్తోంది. 'బస్సు ఫ్రీ.. అని మీరు ఊర్లు తిరిగితే.. మీ భర్తలు బార్లకే..' అంటూ ఆయన గీసిన ఫన్నీ మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదికూడా చదవండి : Rythu Bandhu : రైతు బంధు డబ్బు జమ అప్పుడే.. మంత్రి ప్రకటన!

ఇక ఈ ఇష్యూపై కొంతమంది యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో నెట్టింట మాటలతో దాడులు చేసుకుంటున్నారు. 'వందల ఎకరాల భూస్వామికి రైతు బంధు ఇచ్చినప్పుడు నోరు తెరవని దరిద్రులు పేద మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఏడుస్తున్నారు. తూ.. మీ.. బ.. చె' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహిళలకు ఉచిత బస్సుల వల్ల, బస్సులలో మహిళల డామినేషన్ పెరుగుతుందని ఇలాంటి సమయంలో పురుషుల కోసం ఆర్టీసీ కొన్ని చర్యలు చేపట్టాలని కూడా సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు స్త్రీలను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం అంటూ ఆర్టీసీ బస్సులలో పెద్ద ఎత్తున రాసి ప్రచారం చేసిన ఆర్టీసీ, ఇప్పుడు దానిని మార్చి మగవారి కోసం రాయాలని కోరుతున్నారు. 'మగవారిని గౌరవిద్దాం మగవారికి కేటాయించిన సీట్లలో మగవారిని కూర్చోనిద్దాం. ఈ బస్సు మన అందరిదీ' అంటూ మీమ్స్ చెక్కర్లు కొడుతున్నాయి.

మహాలక్ష్మి పథకం వల్ల మగవాళ్ళు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల మగవాళ్లకు వచ్చిన ఇబ్బంది మరెవరికి రాకూడదని సోషల్ మీడియాలో లబోదిబోమంటున్నారు. చివరికి బస్సుల్లో మగవాళ్ళ కోసం సీట్లు కూడా ఉండని పరిస్థితి దాపురించిందని నెటిజన్లు సరదాగా ఈ పథకం పై సెటైర్లు వేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారంనుంచి టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహలక్ష్మి పథకానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు వయస్సుతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించి ఆ తర్వాత టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ కార్డుతో చూపించి ప్రయాణించాలని, వారం రోజుల తర్వాత తప్పనిసరిగా 'మహాలక్ష్మీ పథకం' గుర్తింపు కార్డు చూపిస్తేనే ఫ్రీ జర్నీకి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

#telangana #women #bus #funny-memes #free
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe