Accident : గుడిసెలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. By B Aravind 26 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి South Goa : గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ (Verna Industrial Estate) వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది (Bus Accident). ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. Also Read: బైక్ పై సాహసాలు.. వీడియో కోసం విన్యాసాలు.. దెబ్బకు సరదా తీరింది! డ్రైవర్ (Driver) మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులకు చికిత్స చేయడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మృతుల బంధువు రూపేందర్ ఈ ఘటనపై మాట్లాడారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తనకు ఫోన్ కాల్ రావడంతో గుడిసె నుంచి బయటికి వచ్చానని.. ఆలోపే బస్సు గుడిసెలోకి దూసుకెళ్లిందని అన్నారు. ఈ ప్రమాదంలో తన సోదరుడు, మామా ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు చెబితే చంపేస్తానంటూ డ్రైవర్ బెదిరించినట్లు వాపోయాడు. ఈ సందర్భంగా మృతుల బంధువు రూపేందర్ మాథుర్ మాట్లాడారు. ఈ ప్రమాదం జరిగిన సమయంతో తనకు ఫోన్ కాల్ రావడంతో గుడిసె నుంచి బయటకు వచ్చానని తెలిపాడు. అంతలోనే గుడిసె (Hut) లోకి బస్సు దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయినట్లు కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్ బెదిరించినట్లు రూపేందర్ వాపోయాడు. చివరికి బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి #telugu-news #bus-accident #goa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి