West Bengal : విధ్వంసం సృష్టిస్తున్న తుపాను.. నలుగురి మృతి.. 100 మందికి గాయాలు!

పశ్చిమ బెంగాల్‌ లోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం.తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి.

West Bengal : విధ్వంసం సృష్టిస్తున్న తుపాను.. నలుగురి మృతి.. 100 మందికి గాయాలు!
New Update

Storm : పశ్చిమ బెంగాల్‌(West Bengal) లోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. రాజర్‌హత్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తుపాను(Storm) వార్తలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerji) కూడా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్ ఎక్స్‌(X) లో ఒక పోస్ట్ కూడా చేశారు. తన పోస్ట్‌లో, 'ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో విపత్తును కలిగించాయని తెలుసుకోవడం విచారకరం. ఇందులో ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది గాయపడ్డారు, ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు మొదలైనవి నేలకొరిగాయి. జిల్లా, బ్లాక్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, DMG, QRT బృందాలు విపత్తు నిర్వహణ కార్యకలాపాలలో పాల్గొని సహాయాన్ని అందిస్తున్నాయి.


బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరణిస్తే కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు జిల్లా యంత్రాంగం నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తుంది. నేను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాను. జిల్లా యంత్రాంగం రెస్క్యూ , రిలీఫ్ అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను.'' అంటూ ట్విటర్‌ లో పేర్కొన్నారు.

మృతులను సేన్‌పరా నివాసి దిజేంద్ర నారాయణ్ సర్కార్ (52), పహర్‌పూర్‌లో నివాసి అనిమా బర్మన్ (45), పుతిమరి నివాసి జగన్ రాయ్ (72), రాజర్హత్ నివాలీ సమర్ రాయ్ (64)గా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గాయపడిన పలువురు ఆసుపత్రిలో చేరినట్లు ధూప్‌గురి ఎమ్మెల్యే నిర్మల్ చంద్ర రాయ్ తెలిపారు. ఈ తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను కలిసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణమే జల్పాయిగురికి బయల్దేరారు. బాధిత ప్రజలను కలిసిన ఆమె.. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని కూడా పరిశీలిస్తారు.

Also Read : నా భర్తను చంపండి..50వేలు పట్టండి:ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ వైరల్.!

#storm #social-media #west-bengal #mamata-benerjee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe