Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. అస్వస్థకు గురైన మాజీ హోంమంత్రి మమమూద్ అలీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ హోం మినిస్టర్ మహమూద్ అలీ.. ఒక్కసారిగా అస్వస్థకు గురై కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరిలించారు.

Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. అస్వస్థకు గురైన మాజీ హోంమంత్రి మమమూద్ అలీ
New Update

తెలంగాణ మాజీ హోం మినిస్టర్, బీఆర్‌ఎస్‌ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఆ సమయంలో మహమూద్‌ అలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయనను పైకిలేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహమూద్ అలీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

Also Read: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

#brs #telugu-news #telangana #mahammad-ali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe