/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/telangana-ali-jpg.webp)
తెలంగాణ మాజీ హోం మినిస్టర్, బీఆర్‌ఎస్ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఆ సమయంలో మహమూద్ అలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయనను పైకిలేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహమూద్ అలీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
#WATCH | Hyderabad: Former Telangana Deputy CM Mahmood Ali faints during #RepublicDay2024 celebrations at Telangana Bhawan. pic.twitter.com/GCzoMb9l8U
— ANI (@ANI) January 26, 2024
Also Read: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై